28.7 C
Hyderabad
April 20, 2024 10: 37 AM
Slider మహబూబ్ నగర్

ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలి

#voterslist

ప్రత్యేక ఓటర్ సవరణ జాబితా – 2023 రూపకల్పనలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ కుమార్ వ్యాస్ సూచించారు. శుక్రవారం ఢిల్లీ నుండి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ సవరణ జాబితా – 2023 రూపకల్పనలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారికి ఓటుహక్కు కల్పించాలని ఆయన తెలిపారు. విద్యాసంస్థల్లో 18 సం.లు నిండిన  విద్యార్థులు తమ పేరును నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఓటరు జాబితాలో ఏవైనా మార్పులు, సవరణలు ఉన్నట్లైతే వాటిని సవరణ చేసి తుది ఓటర్ జాబితా పకడ్బందీగా తయారు చేయాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ 2022, నవంబర్ 9వ. తేది నుండి నవంబర్ 30వ. తేది వరకు రాష్ట్ర వ్యాప్తంగా   ఫామ్ -6 ద్వారా 1,49,975 దరఖాస్తులు రాగా, 19,298 దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందని ఆయన తెలిపారు. ఫామ్ -7 ద్వారా 43, 839 దరఖాస్తులు స్వీకరించగా, ఇందులో 9,605 పరిష్కరించటం జరిగిందని ఆయన అన్నారు. ఫామ్ -8 ద్వారా 38,762 దరఖాస్తులు స్వీకరించగా 7,782 దరఖాస్తులు పరిష్కరించినట్లు ఆయన సూచించారు. ఇంకా పరిష్కారం కాని పెండింగ్ దరఖాస్తులు వివిధ దశలలో ఉన్నాయని ఆయన తెలిపారు. 

2,95,85,004 ఓటర్లకు గాను 1,67,91,349 మంది ఫామ్ – 6(బి) ద్వారా ఆధార్ లింక్ చేసుకోవడం జరిగిందని, 56.76 శాతం ఆధార్ లింక్ దరఖాస్తులలో 42.69 శాతం ఆన్లైన్ ద్వారా, 14.07 ఆఫ్ లైన్ ద్వారా  దరఖాస్తు చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.

ఫారం -8 ద్వారా ఓటర్ కార్డ్ లో మార్పులు, సవరణలు చేసుకోవాలని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఓటరు నమోదు  గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో ప్రత్యేక ఓటర్ నమోదు అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. www.nvsp.in, ceo.telangana.nic.in వెబ్ సైట్ ద్వారా, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో ఓటరు నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఎలక్షన్ సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

హూదూద్ లబ్ధి దారులు కి ఇండ్లను అప్ప చెప్పాలంటున్న సీపీఎం

Satyam NEWS

‘ప్రజాప్రతినిధుల’ కేసులపై సుప్రీం కీలక ఆదేశాలు

Sub Editor

ముస్లింల రిలే దీక్షలకు లాయర్ల మద్దతు

Satyam NEWS

Leave a Comment