30.7 C
Hyderabad
April 19, 2024 08: 30 AM
Slider వరంగల్

56వ రోజుకు చేరిన గ్రామ రెవెన్యూ సహాయకుల దీక్ష

#vra

ములుగు జిల్లా ములుగు మండల కేంద్రంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకులు నిరవధిక సమ్మె దీక్షలు 56 వ రోజుకు చేరింది. ఆదివారం నిరవధిక సమ్మె నిరసనలో ములుగు జిల్లా అధ్యక్షులు పాండవుల మహేందర్  ములుగు మండల వీఆర్ఏల అధ్యక్షుడు నన్నెబోయిన సురేష్, ఉపాధ్యక్షుడు బూరుగు సందీప్,ప్రధాన కార్యదర్శి పరికిరాల మహేష్,నరేష్ రాంబాబు,గంజి స్వామి,పద్మ లలిత,రజిత,లక్ష్మి,మమత సాంబయ్య,సాలయ్య మరియు ఇతర మండల వీఆర్ఏలు పాల్గొన్నారు.

గ్రామ రెవెన్యూ సహాయకులకు అసెంబ్లీ లో ముఖ్యమంత్రి ఇచ్చిన 3 హామీలు తక్షణమే నెరవేర్చాలని వాడు డిమాండ్ చేశారు. పే స్కేల్ జీవో, అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్స్, 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తానని సీఎం హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. హామీని నెరవేర్చి జీవోలను విడుదల చేసేంతవరకు శాంతియుతంగా ఈ నిరవధిక సమ్మెను ముందు కు కొనసాగిస్తామని వారు తెలిపారు.

Related posts

లాక్ డౌన్ పై ప్రజాభిప్రాయం కోరిన మంత్రి

Satyam NEWS

ఛారిటీ: లాక్ డౌన్ ఇబ్బందులు తొలగించడమే లక్ష్యం

Satyam NEWS

కరోనా పై స్వరూపానందేంద్ర సరస్వతి సందేశం

Satyam NEWS

Leave a Comment