27.7 C
Hyderabad
April 25, 2024 07: 51 AM
Slider వరంగల్

సిఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

#TRSMahaboobabad

తెలంగాణ రాష్ట్రంలో విఆర్వో ల వ్యవస్థను రద్దు చేసి కొత్త రెవిన్యూ చట్టం తీసుకురావడం చరిత్రాత్మక ఘట్టమని మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవిన్యూ చట్టం బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్బంగా మరిపెడ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చిత్రపటానికి తెరాస శ్రేణులు పాలాభిషేకం చేసి, బాణసంచా పేల్చారు.

ఈ సందర్బంగా మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ నవీన్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వీఆర్వో  వ్యవస్థను రద్దు చేసి  నవశకానికి నాంది పలికారన్నారు.

ఈ నిర్ణయంతో రైతుల సమస్యలు సమూలంగా ముగిసిపోతాయన్నారు. సీఎం తీసుకువచ్చిన కొత్త రెవిన్యూ విధానంలో అవినీతికి తావు ఉండదని, ఈ చట్టంతో కేసీఆర్ రైతు పక్షపాతి అని మరోసారి ఋజువైందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సింధుకుమారి, చాపల యాదగిరి రెడ్డి,ఎంపిపి అరుణ రాంబాబు,జెడ్పిటిసి శారదా రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

సెకండ్ సెటప్: ఎర్రవెల్లిలో ఎకరం స్థలంలో మరో ఇల్లు

Satyam NEWS

రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఆదుకోవడం లేదు : సోము వీర్రాజు

Satyam NEWS

వలస కూలీలను వెంటాడిన హై వే రోడ్డు ప్రమాదం

Satyam NEWS

Leave a Comment