33.2 C
Hyderabad
April 26, 2024 01: 32 AM
Slider నల్గొండ

ప్రత్యామ్నాయం చూడకుండా వీఆర్వోల రద్దు అన్యాయం

#CITU

అవినీతికి పాల్పడ్డ వి ఆర్ వో లపై చర్యలు తీసుకోవాల్సిందే కానీ కొందరు చేసిన తప్పుల కారణంగా అందరినీ శిక్షించడం సరి కాదని నల్గొండ జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు.

సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ లో వీఆర్ఏ ల సంఘం సమావేశంలో పాల్గొని రోషపతి మాట్లాడుతూ వీఆర్వోలకు ప్రత్యామ్నాయం చూపకుండా వ్యవస్థను రద్దు చేయడం సరైనది కాదని ఆయన అన్నారు.

ఈ తొందరపాటు చర్యవల్ల ప్రజా పరిపాలనలో అనుమానాలకు తావు ఉంటుందని, ఏకపక్షం రద్దు చేయటం అందులో అసెంబ్లీ నడుస్తున్న తరుణంలో ఇలా చేయడం శోచనీయమని అన్నారు.

అఖిలపక్ష పార్టీలతో, ఉద్యోగ సంఘాలతో చర్చించి  సలహాలు తీసుకొని రైతులకి మేలు జరిగేలా మార్పులు చేస్తే కాలానుగుణంగా జరిగే మార్పులు ప్రజలు అంగీకరిస్తారని  అన్నారు. తక్షణమే అఖిలపక్ష నేతలతో చర్చించాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో వీఆర్ఏ సంఘ రాష్ట్ర నాయకులు లక్ష్మి మమల్ల నరసింహరావు,సంఘ నాయకులు సతీష్ ,చెన్నయ్య,వీరబాబు, ఇబ్రహీం, నాగమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమూల్ సంస్థ సంగం డైరీ కి పోటీయే కాదు: ధూళిపాళ్ళ

Satyam NEWS

నిజామాబాద్ లో జాతీయ సమైక్యతకు అద్దంపట్టిన ఫ్రీడం ర్యాలీ

Satyam NEWS

పేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment