28.7 C
Hyderabad
April 20, 2024 03: 32 AM
Slider ఆధ్యాత్మికం

వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌…ఎన్టీఓ సంస్థ ఆధ్వ‌ర్యంలో అభివృద్ది…!

#vysanarayanamettu4

నాటి రాజుల కాలం నుంచీ అదే విజ‌య‌న‌గ‌రంలో పూస‌పాటి వంశీయుల హాయాం నుంచీ అస్స‌లు అభివృద్దికి నోచుకోని వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌ను ఓ స్వ‌చ్చంద సంస్థ అభివృద్ది చేసుంద‌కు ముంద‌కు వ‌చ్చింది. ఏడాది క్రితమే అంటే కరోనా సెకండ్ వేవ్ ప్ర‌బ‌లుతున్న వేళ‌…అస్స‌లు వ్యాస‌నారాయ‌ణ మెట్ట ప‌రిస్థితి ఎలా గుంది..? అస్స‌లు దాని స్థితి గ‌తులు  ఏంట‌ని..స‌త్యం న్యూస్.నెట్ ప్ర‌తినిధి ఆ మెట్ట వ‌ద్ద‌కు వెళ్లారు.

ప్ర‌త్య‌క్షంగా మెట్ట ప‌రిస్థితిపై అధ్య‌య‌నం చేసారు. మెట్ట‌పై ఉన్న వ్యాసనారాయ‌ణ‌,ల‌క్ష్మీ దేవి,శివుని  విగ్ర‌హాలు వాటి దైన్య స్థితిని తెలుసుకుని  ఈ వ్యాసనారాయ మెట్ట త‌న పూర్వ వైభ‌వ స్థితి మ‌ల్లీ వ‌స్తుందా…జ‌న బాహుళ్యంలోకి తీసుకొచ్చేదెవ‌రు అని అనుకుంటున్న త‌రుణంలోనే  శ్రీ ప‌ట్నాల  అప్పారావు కైండ్ సొసైటీ ముందుకు వ‌చ్చింది.

గుర‌జాడ కేంద్ర గ్రంధాలయం నుంచీ మెట్ట పూర్వ చ‌రిత్ర‌, నాటి రాజుల  కాలంలో ఏ విధంగా న‌డిచింది, త‌దనంతర కాలంలో మెట్ట ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న దానిపై  స్పార్క్ సంస్థ అధ్యయ‌నం చేసింది. దీంతో దేవాదాయ శాఖతో క‌లిసి మెట్ట‌ను అభివృద్ది  చేసేంద‌కు న‌డుంబిగించింది.

మొత్తం మెట్ట 41 ఎక‌రాల‌లో  ఉండ‌టంతో పూల్ భాగ్ కాలం నుంచీ కాక బాబామెట్ట  ద‌ర్గా నుంచీ వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌కు ఉన్న మార్గంలో మెట్ట ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించి త‌ద‌నుగుణంగా మెట్ట‌ను అభివృత్ది చేసేందుకు న‌డుం బిగించారు.ఈ మేర‌కు  మెట్ట‌కు ప్ర‌వేశం వ‌ద్ద గేటు ను అమ‌ర్చ‌డంతో పాటు మెట్ట ఎగువ ప్రాంతంలో వ్యాస‌నారాయ‌ణ కొలువైన స్థ‌లం వ‌ద్ద ఓ చిన్న గేటు ను దానికి తాళాన్ని  ఏర్పాటు చేసారు.

అలాగే  దిగువ ప్రాంతం నుంచీ మెట్ట ఎగువ ప్రాంతం వ‌ర‌కు విద్యుత్ శాఖ ను సంప్ర‌దించింది..ప్ర‌త్యేకించి విద్యుత్ స్తంభాలు,మీట‌ర్లు, వీధి దీపాల‌ను అమ‌ర్చారు. అలాగే మెట్ట ప్రాంగణంలో ల‌క్ష్మీ దేవి కొలువైన ప్రాంతానికి మెట్ట కట్ట‌డంతో వ్యాస‌నారాయ‌ణ  విగ్ర‌హం ప్రాంతాన్ని కూడా  ఆహ్లాద క‌రంగా అభివృద్ది పరిచారు. ఇక పూల్ భాగ్ కాల‌నీ, బాబా మెట్ట ద‌ర్గాకు స‌మపంలో ఉన్న వ్యాసనారాయ‌ణ మెట్ట జ‌న‌బాహుళ్యంలోకి వ‌చ్చింది.

(మెట్ట పై దుండ‌గుల క‌న్ను..త‌రువాయి భాగంలో)

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్

Related posts

ప్రజారంజక బడ్జెట్

Murali Krishna

న్యూ వెపన్: ఐదు వేల కిలోమీటర్ల లక్ష్యంతో బాలిస్టిక్ క్షిపణి

Satyam NEWS

50 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సత్వర చర్యలు

Satyam NEWS

Leave a Comment