ఆంధ్ర ప్రదేశ్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీ.జీ. భరత్ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఆర్య వైశ్యులు మంత్రి టిజి భరత్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో వనపర్తి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి దాచ లక్ష్మీనారాయణ, వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆకుతోట దేవరాజ్, శ్రీశైలం మల్లికార్జున ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రం చైర్మన్ మీడిదొడ్డి శ్యాంసుందర్, గుంత మల్లేష్, నాగ బంది యాదగిరి ఉన్నారు. ఈ వివరాలు దాచ లక్ష్మీనారాయణ తెలిపారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్