30.7 C
Hyderabad
April 19, 2024 09: 31 AM
Slider నల్గొండ

ధరలకు అనుగుణంగా రైస్ మిల్ కార్మికుల వేతనాలు పెంచాలి

#ricemillworkers

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రైస్ మిల్లులో పనిచేసే డ్రైవర్,డైలీ వేజ్ గా పనిచేసే దిన కూలీలు కార్మికులు,నెలవారి వేతనాలు, రోజువారి కూలి పెంచాలని,వెంటనే మిల్లర్స్ అసోసియేషన్ కమిటీ స్పందించాలని టి యన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి కోరారు.

9వ,తేదీన రాత్రి పొద్దు పోయిన తర్వాత హుజూర్ నగర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలిశెట్టి లక్ష్మీ నరసింహరావు,రైస్ మిల్లు డైవర్స్,దినసరి కూలీలు రెండవ డిమాండ్ నోటీసు ఇచ్చారు.డిమాండ్ నోటీసు ఇచ్చిన అనంతరం శీతల రోషపతి మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి వంటగ్యాసు ధర రోజుకు ఒకసారి పెంచుతూ,మంచి నూనె,కందిపప్పు ఇతర నిత్యావసర వస్తువులు విపరీతంగా పెంచుతున్నా వాటిపై ప్రభుత్వాల నియంత్రణ లేని పరిస్థితుల్లో ఉందని, కనుక తక్షణమే కార్మికుల వేతనాలు పెంచటం వలన వచ్చే పండుగలకు అప్పు చేయకుండా కార్మికులు పండుగలు చేసుకుంటారని అన్నారు.

ఈ సందర్భంగా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలిశెట్టి లక్ష్మీ నరసింహారావు స్పందించి సంక్రాంతి పండగ అనంతరం కార్మికులతో జాయింట్ చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు ఆకం కోటేశ్వరరావు,కార్యదర్శి లాలయ్య, రామయ్య,బోస్,రైస్ మిల్ దిన కూలీల అధ్యక్షురాలు సామల కోటమ్మ,షేక్ మున్ని, మంగమ్మ,స్వరూప,బుజ్జి,పద్మ,వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

క‌రోనా మహమ్మారి కాలంలో నిశ్బబ్ద భాదితులు దివ్యాంగులే

Sub Editor

రూ.2 వేల మద్యం బాటిల్ రూ.300 తక్కువకే

Satyam NEWS

సమ సమాజ స్థాపన కోసం అలుపెరగని పోరాటం చేసిన జగజ్జీవన్ రామ్

Satyam NEWS

Leave a Comment