బుధవారం సాయంత్రం వనపర్తి జిల్లా కేంద్రంలోని స్థానిక చాణిక్య హైస్కూల్ రోడ్డుపై ఎవరిదో మొబైల్ ఫోన్ పడి ఉండడం గమనించిన బిఆర్కె న్యూస్ విలేకరి అబ్దుల్ వహీద్ ఆ సెల్ ఫోన్ తీసుకుని గమనించగా ఎవరో అభాగ్యులు పొరపాటున క్రింద పడవేసుకొని ఉండవచ్చని గ్రహించారు. రెండు గంటలసేపు ఎవరైనా ఆ ఫోనుకు కాల్ చేస్తారేమో అని వేచి చూసిన వహీద్ ఎలాంటి ఫోన్ కాల్ రాకపోవడంతో దొరికిన సెల్ఫోన్ లో విలువైన సమాచారం ఉంటుందనే ఉద్దేశంతో పోగొట్టుకున్న అభాగ్యునికి చేర్చాలని వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై హరిప్రసాద్ కు సమాచారం అందించారు. స్వయంగా తన సహచర విలేకరులు రాజ్ న్యూస్ విలేకరి సుంకరి రమేష్, మెట్రో టీవీ విలేకరి గోవర్ధన్ తో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్సై హరిప్రసాద్ కు సెల్ ఫోన్ దొరికిన తీరును వివరించారు. విలేకరి వహీద్ నిజాయితీని చూసి వనపర్తి ఎస్సై విలేకరులను అభినందించారు. సెల్ఫోన్ యజమానికి ఫోన్ అందజేస్తామని ఎస్ఐ చెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని ఎస్సై కోరారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్