34.2 C
Hyderabad
April 23, 2024 13: 56 PM
Slider మహబూబ్ నగర్

నర్సింగ్ కళాశాల పనులను వెంటనే పూర్తి చేయాలి

#wanaparthycollector

నర్సింగ్ కళాశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.

మంగళవారం వనపర్తి పట్టణంలోని నర్సింగ్ కళాశాలను సందర్శించి, నిర్మాణ పనులలో ఎలాంటి జాప్యం లేకుండా సత్వరమే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆమె తెలిపారు. నూతన కలెక్టరేట్ కార్యాలయ సముదాయాన్ని తనిఖీ చేసి, ప్లాంటేషన్ ను ఆమె పరిశీలించారు. నూతన కలెక్టరేట్ ప్రాంగణం అందమైన మొక్కలను నాటి, పరిసరాలను తీర్చిదిద్దాలని, ఆకర్షణీయంగా ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈ.ఈ. దేశ్య నాయక్, డి.ఈ. దానయ్య, కాంట్రాక్టర్ రామారావు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

జాతీయ స్థాయిలో ఎన్ టీ ఆర్ నేషనల్ లెజెండరీ అవార్డ్స్

Bhavani

సేక్రెడ్ ఎఫైర్: విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు

Satyam NEWS

ప్రపంచ ఓజోన్ డే కవితల పోటీకి విశేష స్పందన

Satyam NEWS

Leave a Comment