32.7 C
Hyderabad
March 29, 2024 12: 34 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లాను అగ్రభాగంలో నిలపాలి: జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు

#wanaparthypolice

మంచి పనితీరు, శాంతి భద్రతల పరిరక్షణలో మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తూ జిల్లా పోలీసు శాఖను తెలంగాణ రాష్ట్రంలో అగ్రభాగంలో నిలపాలని వనపర్తి జిల్లా ఎస్పీ   కె.అపూర్వరావు సూచించారు.

నూతన సంవత్సర సందర్భంగా శనివారం రోజు  జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ  కేక్ కట్ చేసి పోలీసు అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ 2021 సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాలలో చాలా మార్పు తెచ్చిందని, కోవిడ్ కష్టకాలంలో ముందు వరుసలో ఉండి ప్రజల జీవితాలకు రక్షణ కల్పించే విధంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ పోలీసులు విధి నిర్వహణ చేయడం అభినందనీయన్నారు. పోలీసుశాఖ పట్ల ప్రజలలో  గౌరవం ఉన్నదని ఆ గౌరవాన్ని నిలిపే విధంగా విధి నిర్వహణ చేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడడం లక్ష్యంగా, వారు కోవిడ్ బారిన పడకుండా చేయగలిగామని ఆమె చెప్పారు.

పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని, ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నిత్యం యోగా లాంటి ఆరోగ్య సూత్రాలను పాటించాలని, మన ఉద్యోగాన్ని మనం ఎంత ప్రేమిస్తున్నామో అదే పద్దతిలో జాగ్రత్తగా విధి నిర్వహణ చేసుకోవాలన్నారు. తెలంగాణ జిల్లాల్లో దాదాపు అన్ని ప్రాంతాలలో వనపర్తి జిల్లాకు సంబంధించిన పోలీసు అధికారులు విధి నిర్వహణ చేస్తున్నారని ఇది జిల్లాకు  ఎంతో  గర్వకారణమని ఆమె అభినందించారు.

2022లో మరింత సమిష్టిగా పనిచేస్తూ మంచి ఫలితాలు, విజయలను సాధిస్తూ జిల్లా పోలీసుల గౌరవం పెంచే విధంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి అదనపు ఎస్పీ, షాకీర్ హుస్సేన్, వనపర్తి డిఎస్పి, కె ఎం, కిరణ్ కుమార్, వనపర్తి సీఐ, ప్రవీణ్ కుమార్, కొత్తకోట సీఐ, శ్రీనివాసురెడ్డి, ఆత్మకూరు సిఐ, రత్నం,రిజర్వ్ ఇన్స్పెక్టర్లు,వెంకట్, జగన్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై, రామన్ గౌడ్, వనపర్తి పట్టణ ఎస్సై, మధుసూదన్, వనపర్తి రూరల్ ఎస్సై, చంద్రమోహన్ రావు, జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ల ఎస్సైలు, పోలీసు సిబ్బంది,  జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, ఎస్పీ పీఆర్వో, రాజగౌడ్, సీసీ మధు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్.నెట్

Related posts

నిబంధనలు ఉలంఘిస్తే kesulu

Bhavani

ఈ పసిపిల్లలకు ఉన్న జ్ఞానం మనకు ఎప్పుడు వస్తుందో……?

Satyam NEWS

ఈ నెల 28న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment