వనపర్తిలోని 31 కేంద్రాల్లో 2వ రోజు ప్రశాంత వాతావరణంలో గ్రూప్-II పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2వ రోజు గ్రూప్ టు రాత పరీక్షలకు సంబంధించి వనపర్తి జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను జోగులాంబ జోన్ డిఐజి ఎల్.ఎస్. చౌహన్ వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి పరిశీలించారు. పరీక్ష సరళిని పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు పరిశీలించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తదితర పరీక్ష కేంద్రాలను పర్యావేక్షించారు. పోలీసు అధికారులు, సిబ్బంది అందరు బాధ్యతగా పని చేయాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష పత్రాలు స్ట్రాంగ్ రూముకు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని డిఐజి కోరారు. డిఐజితో పాటు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు, వనపర్తి సీఐ, క్రిష్ణ ఉన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్