విద్యార్థులు , ఉద్యోగులు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వనపర్తి పట్టణంలో సిటీ బస్సులు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తొలగిపోతాయని గుర్తించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి పట్టణంలో లోకల్ సర్వీసును ప్రారంభించారు. పట్టణంలో 10 కిలోమీటర్ల బస్సును డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లారు. ప్రజలతో మమేకమే ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి వనపర్తి ఎమ్మెల్యేగా రావడం వనపర్తి నియోజకవర్గానికి శుభసూచకమని వారు ఎమ్మెల్యేను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని మొదటగా వనపర్తి పట్టణ విద్యార్థుల, సామాన్య ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ఈ బస్సును ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్స్, పీసీసీ డెలిగేట్, వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్