32.2 C
Hyderabad
March 28, 2024 21: 27 PM
Slider మహబూబ్ నగర్

పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

#WanaparthySP

వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ల సీఐలు, ఎస్సైలతో వనపర్తి జిల్లా  ఎస్పీ కె.అపూర్వరావు నెలవారి నేరసమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ముందుగా ఎస్పీ     పోలీసు అధికారులను  గతంలో పోలీస్టేషన్లలో చాల కాలం పెండింగ్ లో ఉన్న  కేసుల వివరాలు, పోలీస్టేషన్లలో రోజువారీగా నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి   తెలుసుకున్నారు.

అందుకు గల కారణాలను తెలుసుకొని  పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ నేరసమీక్ష సమావేశంలో ఎస్పీ  మాట్లాడుతూ మహిళల భద్రత కొరకు పటిష్ట చర్యలు చేపట్టి పోలీస్టేషన్లలో మహిళ సిబ్బందికి, పోలీస్టేషన్ కి వచ్చే మహిళా ఫిర్యాదులకు సరియైన వసతులు కల్పించి వారిని గౌరవించాలని తెలిపారు.

పోలీసు కళాబృందం, షీ టీమ్స్ ద్వారా ప్రజలకు,విద్యార్థులకు, విస్తృతంగాఅవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,

వేసవి కాలంలోదొంగతనాల నివారణ గురించి పగలు రాత్రి గట్టి పెట్రొలింగ్  బీట్లు నిర్వహించాలని సూచించారు. 

గ్రామాలలో అనుమనంగా తిరిగే వ్యక్తులను గుర్తించి,వారిపై నిఘా పెట్టాలని తెలిపారు.

పోలీస్టేషన్ కు వచ్చే ప్రతి పిర్యాదు యొక్క సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వారి మనసులో భద్రతా భావాన్ని, విశ్వాసాన్ని పెంపొందించాలని అన్నారు.

మారుతున్న సమాజానికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానం  పెంపొందించుకుని వృత్తి నిర్వహణకు సంబంధించిన చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండి వాటిలో జరిగే మార్పులపై నిరంతరం అవగాహన పెంచుకుని తన సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని కోరారు. సాంకేతిక పై పూర్తిగా అవగాహన కలిగి ఉండి అవసరమైన సమయంలో తగు రీతిలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు.

ఆన్లైన్ మోసాలకు సంబందించిన కేసుల చేదనలో సైబర్ క్రైమ్ టీం సహాయం తీసుకొని నేరం జరిగిన రెండు, మూడు రోజులలో ఆ కేసులను ఛేదించాలని అధికారులకు సూచించారు.

దొంగతనాల పై ప్రత్యేక నిఘా ఉంచాలని, పెట్రోలింగ్, బీట్స్ ను రాత్రి వేళల్లో పకడ్బందీగా కొనసాగించాలని అన్నారు. 

పోలీస్టేషన్ లో నిర్వహించే పోలీసు వర్టీకల్ విభాగాల సిబ్బంది వారికి కేటాయించిన పనులను సమర్ధవంతంగా నిర్వహిచాలని అన్నారు. 

డయల్ 100 ఫిర్యాదులపై  వెంటనే స్పందించాలని తెలిపారు. 

గ్రామ, క్రింది స్థాయిలో సమాచార సేకరణ వనరులను వృద్ధి చేసుకుని ప్రతి సమస్య, ప్రతి సమాచారం పోలీసు వారికి వచ్చే విధంగా సంబంధాలు కలిగి ఉండాలని, స్నేహపూర్వక పొలిసంగ్ నిర్వహించాలని అన్నారు.

గుట్కా, గ్యాంబ్లింగ్ దాడులు  నిర్వహించి జిల్లాలో గుట్కామట్కాను పూర్తిగా అరికట్టాలని అన్నారు.

ఈ నేరసమీక్ష సమావేశంలో  వనపర్తి అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, వనపర్తి డిఎస్పి కెఎం, కిరణ్ కుమార్,

డీసీఆర్బీ ఇన్స్పెక్టర్, జమ్ములప్ప, వనపర్తి సిఐ, సూర్య నాయక్, కొత్తకోట సీఐ,మల్లికార్జున్ రెడ్డి, ఆత్మకూరు సీఐ,సీతయ్య, జిల్లాలోని ఎస్సైలు, జిల్లా పోలీసుసిబ్బంది ఉన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

ఉచిత బియ్యం పథకాన్ని కొనసాగించాలంటూ బీజేపీ ధర్నా

Satyam NEWS

రక్తదాన శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్న యువకులు

Satyam NEWS

హైకోర్టు జడ్జికి శుభాకాంక్షలు తెలిపిన సుధా నాగేందర్

Satyam NEWS

Leave a Comment