39.2 C
Hyderabad
March 29, 2024 16: 39 PM
Slider మహబూబ్ నగర్

ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తే నే ప్రజల్లో పోలీసులకు గుర్తింపు

#WanaparthyPolice

వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో  వనపర్తి జిల్లాలోని పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ  నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.

నేరసమీక్ష సమావేశంలో ముందుగా ఎస్పీ  పోలీస్టేషన్ల వారీగా పోలీసు అధికారులను  గతంలో పోలీస్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ శాంతిభద్రతలు, నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలు, కేసుల పరిశోధన, అలాగే పెండింగ్లో ఉన్న కేసులు, బెయిల్స్, నేరస్తులను గుర్తించుట, లా అండ్ ఆర్డర్,పిటి కేసులు, త్వరితగత డిస్పోజల్స్, కన్వెక్షన్ కు ప్రాధాన్యత, పిటి కేసులలో పరీక్షలకు ముందు సాక్షులను బ్రీఫింగ్ చేయడం, ఎఫ్.ఐ. ఆర్.  తర్వాత చేయు పరిశోధనలో పార్ట్-2 లలో ఇన్వెస్టిగేషన్ అధికారి మాత్రమే స్వయంగా రాతపూర్వకంగా వివరాలు నమోదు చేయాలన్నారు.

అత్యవసర సమయంలో  ప్రజలు వినియోగించే డయల్ 100 కాల్స్ పట్ల వేగవంతం అయినా స్పందన తప్పక ఇవ్వాలని, తక్కువ సమయంలో సంఘటన స్థలానికి చేరి సేవలు అందించాలని, డయల్ 100 ఫిర్యాదుల పట్ల రెస్పాన్స్ సమయం, క్లోజింగ్ సమయం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు.

నమోదైన ప్రతి కేసులు క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తప్పనిసరిగా ఉండాలన్నారు. నమోదు చేసిన ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రొఫార్మా జతపరచాలి అని సూచించారు.

ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఇంప్రూమెంట్ ఉండాలన్నారు. ఈ పిట్టి కేసులు,ఈ చాలన్ కేసుల ద్వారా నేర తీవ్రతని తగ్గించే వీలు కలదని, చిన్నచిన్న నేరాల పట్ల ఈ పెట్టి కేసులు నమోదు చేయాలని తెలిపారు.

జిల్లాలోని ప్రతి పోలీసు అధికారి తమ వర్టికల్ పట్ల పూర్తిగా మనసు పెట్టి,  17 వర్టికల్స్ గురించి ప్రతి ఒక్క పోలీసుఅధికారి కి తెలిసి ఉండాలని, పోలీస్టేషన్ లోని ప్రతి వర్టికల్ అధికారి తమ తమ వర్టికల్ నియమ నిబంధనలు తెలుసుకొని పని చేయాలని, ఉన్నత అధికారులు ఏ సమయంలో అయినా వర్టికల్ గురించి అడిగిన చెప్పే విధంగా ఉండాలన్నారు. 

ప్రతి పోలీస్టేషన్లోని అన్ని వర్టికల్స్ ని అధికారులు ప్రతి వర్టికల్ అధికారినీ పర్యవేక్షించాలని, ప్రతి ఒక్కరూ తమ పోలీస్ స్టేషన్ నందు 5s పద్ధతిని తప్పకుండా పాటించాలని తెలిపారు. పోలీస్టేషన్లోని రిసెప్షన్, బ్లూకోట్స్, పెట్రో కార్స్, కోర్టుడ్యూటీ, డయల్  100, సెక్షన్ ఇన్చార్జ్ మొదలగు వాటి పట్ల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. 

ఆస్తి సంబంధిత నేరాలు,మహిళా సంబంధిత నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. 

సైబర్ నేరాలపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలి

పకడ్బందీగా బిట్లు, పెట్రోలింగ్ నిర్వహిస్తూ, అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అదేవిధంగా పోలీసుకళాబృందం కార్యక్రమం ద్వారా కమ్యూనిటీ పోలీసింగ్, నేను సైతం, షీ టీం ల కార్యక్రమాల ద్వారా డయల్ 100, మహిళలపై జరిగే నేరాల గురించి, మూఢనమ్మకాలు, ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత నియమాలు, సైబర్ నేరాలపై వివిధ చట్టాలు, గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో తరచుగా నేరాలకు పాల్పడుతున్న నేరస్తుల జాబితాను సిద్ధం చేసి పీడీ యాక్ట్ అమలుపరచడానికి ప్రపోజల్స్ పంపించాలని సూచించారు.

పిటిషన్ మాడ్యూల్లో పిటిషన్ మేనేజ్మెంటులో  ప్రతి రోజూ ప్రతి పిటిషన్లు తప్పకుండా ఎంట్రీ చేయాలని లేనిచో సంబంధిత రిసెప్షనిస్ట్, సంబంధిత ఎస్సైలపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో జిల్లాలోని పోలీసు అధికారులు అందరూ తనిఖీలు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ, సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు  ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్పీ  సూచించారు.

ఈనెలవారి సమీక్షా సమావేశంలో  అదనపు ఎస్పీ,షాకిర్ హుస్సేన్, వనపర్తి డిఎస్పి, కె ఎం, కిరణ్ కుమార్, డీసీఆర్బీ  సిఐ జమ్ములప్ప, సిసిఎస్ సీ ఐ, శ్రీనివాస్,  వనపర్తి సి ఐ సూర్య నాయక్, కొత్తకోట సీఐ మల్లికార్జున్ రెడ్డి,ఆత్మకూరు సిఐ సీతయ్య వనపర్తిజిల్లాలోని ఎస్సైలు ఉన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

మూడు చిత్రాలను ప్రకటించిన వ్యాపారవేత్త సురేష్‌రెడ్డి

Satyam NEWS

కేసీఆర్ కార్యాలయం ఎదుట ఒకరి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Wash out: గోవాలో తుడిచిపెట్టుకుపోతున్న కాంగ్రెస్

Satyam NEWS

Leave a Comment