వనపర్తి రైల్వే లైన్ కోసం సర్వే పూర్తయిందని, కానీ బడ్జెట్ లో వనపర్తి రైల్వే లైన్ లేదని కాంగ్రెస్ నేత, వనపర్తి మునిసిపల్ వైస్ చైర్మన్ బి. కృష్ణ చెప్పారు. వనపర్తిలో అయన విలేకరులతో మాట్లాడుతూ వనపర్తి రైల్వే లైన్ కోసం ఉద్యమం చేస్తామని చెప్పారు. 2023లో రైల్వే లైన్ గురించి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి తమకు లెటర్ పంపారని అయన తెలిపారు. గతంలో చాలా సార్లు రైల్వే లైన్ కోసం దీక్షలు, పోరాటం చేశామని అయన వివరించారు. తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా కానీ రైల్వే బడ్జెట్ లో అన్యాయం జరిగిందని అయన విమర్శించారు. రైల్వే లైన్ కోసం ఉద్యమం రాష్ట్రా స్థాయికి తీసుకువెళతామని అయన తెలిపారు. పార్టీలకు అతితంగా ఉద్యమం చేస్తామని అయన చెప్పారు. నాయకులు బొడ్డుపల్లి పరుశరామ్, కుమార్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్