గత వారం రోజులుగా భారీగా పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడటంతో సరిహద్దు భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి సంక్లిష్టమైన పరిస్థితినైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాయి. గత వారం రోజులుగా దాదాపు 60 మంది ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లోని పలు ప్రాంతాలలో సరిహద్దులు దాటి వచ్చేశారు. మరో 500 మంది పాకిస్తానీయులు సరిహద్దు వద్ద మోహరించి ఉన్నట్లు నిఘావర్గాలు సమాచారం అందించాయి. దాంతో ఒక వైపు చొరబడ్డ వారి కోసం గాలిస్తూనే సరిహద్దు దాటేందుకు సిద్ధంగా ఉన్న500 మంది పై నిఘా వేసి ఉంచారు. ఈ నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది. కేవలం సరిహద్దును కాపలా కాయడం వరకే పరిమితం కాకుండా మరింత వేగంగా కదిలేందుకు భారత సైన్యం సన్నద్ధంగా ఉందని భారత సైనికాధి కారి ఒకరు తెలిపారు. నేటి మధ్యాహ్నం చీఫ్ ఆర్మీ బిపిన్ రావత్ మాట్లాడుతూ 2016లో చేసినట్లు సర్జికల్ స్ట్రైక్ చేయడానికి లేదా 2019లో బాలాకోట్ టెర్రర్ క్యాంప్ పై చేసినట్లుగా ఆకస్మిక దాడి చేయడానికి కూడా భారత సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆయన చెప్పిన తర్వాత నేటి సాయంత్రానికి భారత సైన్యం సరిహద్దు వెంబడి మోహరించి ఉంది. నేటి రాత్రి సమయంలో మొత్తం మొహరింపు పూర్తి అవుతుందని అనుకుంటున్నారు. 500 మంది ఉగ్రవాదులు సరిహద్దు అవతల వేచి ఉండటం అంటే సాధారణ పరిస్థితి కిందికి రాదని సైనికాధికారులు భావిస్తున్నారు. శీతాకాలం సమీపిస్తుండటంతో సహజంగానే ఉగ్రవాదుల చొరబాట్లు అధికం అవుతాయి. అయితే ఈ సారి అనూహ్యంగా పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు సరిహద్దుల్లో వేచి ఉండటమే సైనికాధికారులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తున్నది. గుర్జ్, కార్గిల్, మెక్చిల్, కేరన్, తంగ్‌ధర్, ఊరి ప్రాంతాలు మంచుతో కప్పేసిఉంటాయి. ఈ సమయంలోనే ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడతారు. సరిహద్దుల్లో తిష్ట వేసి ఉన్నఉగ్రవాదులు చిన్న చిన్న ఆయుధాలను ఉపయోగించే వీలు ఉన్నందున భారత సైన్యం కూడా సన్నద్ధంగా ఉండాలని నిఘావర్గాలు హెచ్చించాయి. బాలాకోట్ లో ఇప్పటికే ధ్వంసం చేసిన ఉగ్రవాద శిబిరం కూడా మళ్లీ తెరిచి అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నిఘావర్గాలు వెల్లడించాయి.
previous post
next post