Slider ప్రపంచం

ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య తీవ్రమైన పోరాటం

#afghanistan

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య కాల్పుల హోరు రోజు రోజుకు తీవ్రమౌతున్నది. ఇటీవల పాకిస్తాన్ విమానాలు ఆఫ్ఘనిస్థాన్ దేశం లోపల వైమానిక బాంబు దాడులు చేసింది. దాంతో ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన తాలిబాన్ బలగాలు పొరుగున ఉన్న పాకిస్తాన్‌లోని అనేక స్థావరాలను ముట్టడించాయి. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. చాలాకాలంగా పాకిస్తాన్‌తో ఆఫ్ఘనిస్థాన్ కు సరిహద్దు సమస్యలు ఉన్నాయి.

ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా ఖోవారాజ్మీ మాట్లాడుతూ చాలా భూభాగాలను మేము పాకిస్తాన్ చెబుతున్నట్లు వారి భూభాగంగా పరిగణించము. కాబట్టి మేము మా భూభాగాన్ని వదులుకోలేము. ఊహాజనిత రేఖకు మాత్రమే కట్టుబడి ఉంటాం తప్ప పాకిస్తాన్ చెప్పినట్లు జరగదని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ దశాబ్దాలుగా డ్యూరాండ్ లైన్ అని పిలువబడే సరిహద్దును తిరస్కరించింది. 19వ శతాబ్దంలో బ్రిటీష్ కలోనియల్ అధికారులు ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ మధ్య ఉన్న పర్వత శ్రేణిని సరిహద్దుగా నిర్ణయించారు. దీని వద్దే తరచూ వివాదాలు చెలరేగుతున్నాయి. పాకిస్తాన్ మిలిటరీ పబ్లిక్ రిలేషన్స్ విభాగం, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఈ దాడులపై స్పందించలేదు.

Related posts

రఘురామ డౌట్: కోర్టు విషయం సాక్షి ముందే ఎలా చెప్పింది?

Satyam NEWS

ఉద్యమకారునికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన కార్పొరేటర్ శ్రీదేవి

mamatha

32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ

Satyam NEWS

Leave a Comment