35.2 C
Hyderabad
April 24, 2024 13: 45 PM
Slider జాతీయం

ప్లాస్టిక్ భూతంపై నింజా మీడియా పోరాటం

ninja media

పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్ భూతంపై నింజా మీడియా క్రియేషన్ తన వంతు పోరాటం ప్రారంభించింది. రైల్వే స్టేషన్లలో ఆడియో ప్రకటనలు ప్రసారం చేసే అధీకృత కంపెనీ అయిన నింజా మీడియా క్రియేషన్స్ తన సామాజిక బాధ్యతను నెరవేర్చడంపై పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

పర్యావరణానికి కీడు చేసే ప్లాస్టిక్ ను వాడవద్దని నింజా మీడియా క్రియేషన్స్ ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ జిల్లా భిలాయి పవర్ హౌస్ రైల్వే స్టేషన్ లో క్యాంపెయిన్ ప్రారంభించింది. దేశంలోని ఏడు రాష్ట్రాలలో 50 రైల్వే స్టేషన్లలో ఆడియో ప్రకటనలు విడుదల చేసే అధీకృత కంపెనీ అయిన నింజా మీడియా తనకున్న అన్ని వనరులను వినియోగించుకుని అన్ని రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ వాడకంపై ప్రజలలో అవగాహన పెంచాలని నిర్ణయించింది.

మూడు నెలల పాటు ఆడియో జింగిల్స్ ను సామాజిక బాధ్యతగా ప్రసారం చేస్తామని నింజామీడియా క్రియేషన్స్ మేనేజింగ్ పార్టనర్ రంజిత్ సి నేడు సత్యం న్యూస్ కు తెలిపారు. ఆడియో జింగిల్స్ ద్వారా ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారం చేస్తూ ఆ ప్రచారం మరింత ప్రభావం చూపేందుకు వీలుగా నింజా మిడియా సిబ్బింది కూడా ప్లకార్డుల ద్వారా అదే రైల్వే స్టేషన్లలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రయాణీకులను వ్యక్తిగతంగా కలిసి ప్లాస్టిక్ వినియోగం నిర్మూలించాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు.

రంజిత్ మాట్లాడుతూ మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సరైన మార్గంలో మంచి జీవన విధానాలను అనుసరించడం ద్వారా పర్యావరణానికి మేలు చేయవచ్చునని చెప్పడమే తమ ఉద్దేశ్యమని ఆయన అన్నారు.

నింజా మీడియా క్రియేషన్స్ సిబ్బంది కూడా ఎంతో ఉత్సాహంగా ప్లాస్టిక్ రహిత సమాజ ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారని రంజిత్ తెలిపారు. ఈ ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారం ఇప్పటికే ప్రారంభం అయినందున త్వరలో ఏడు రాష్ట్రాలలోని 50 రైల్వే స్టేషన్లలో క్యాంపెయిన్ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

Related posts

జీఎస్టీ పరిహారం మొత్తాన్ని కేంద్రమే చెల్లించాలి

Satyam NEWS

భారీ వర్షాలతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం

Bhavani

డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వే లైన్ అలైన్మెంట్ మార్పుకు చర్యలు

Bhavani

Leave a Comment