27.7 C
Hyderabad
April 26, 2024 05: 12 AM
Slider ప్రపంచం

రష్యా అతి పెద్ద యుద్ధ నౌకను ముంచేసిన ఉక్రెయిన్

#russiawarship

రష్యా భారీ యుద్ధ నౌకను ఉక్రెయిన్ ముంచివేసింది. నల్ల సముద్రంలో రష్యా మోహరించిన ఈ ఫ్లాగ్‌షిప్ ఉక్రెయిన్ దాడిలో మునిగిపోవడం సంచలన వార్త అయింది. అయితే ఈ విషయాన్ని రష్యా ఖండించింది. ఉక్రెయిన్ దాడి వల్ల తమ ఫ్లాగ్ షిప్ మునిగిపోలేదని, సాంకేతిక లోపాలతోనే అలా జరిగిందని రష్యా చెబుతున్నది.

తమ సైన్యం తీరం నుండి ప్రయోగించిన క్షిపణులతో రష్యా యుద్ధ నౌక మునిగిపోయినట్లు ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఓడ నుంచి 500 మందికి పైగా నావికులను రష్యా సురక్షిత ప్రాంతానికి తరలించాల్సి వచ్చింది. నల్ల సముద్రం లోని రష్యా నౌకాదళంలో అతిపెద్ద నౌక మోస్క్వా. దీనిపైన విమానాలను కూల్చివేసేందుకు వాడే క్షిపణులు మోహరించి ఉంటాయి.

అదే విధంగా ఒడ్డుపై దాడి చేయడానికి గైడెడ్ క్షిపణులు కూడా ఈ నౌకలో ఉంటాయి. వాయు రక్షణ కవచాన్ని అందించడానికి రాడార్‌ను కలిగి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రష్యా సైన్యం నల్ల సముద్రంలో మోహరించి అత్యంత కీలక నౌక. దాన్ని ఉక్రెయిన్ కూల్చివేసి నీటిలో ముంచేసింది. రష్యా తన నౌకాదళ శక్తిని ఉపయోగించి ఉక్రేనియన్ నౌకాశ్రయాలను ఇప్పటికే ఛిన్నాభిన్నం చేసింది.

అంతే కాకుండా తీరం వెంబడి దాడులు చేస్తూ ఉక్రెయిన్ కు ఊపిరి ఆడకుండా చేసింది. 1982 ఫాక్‌లాండ్స్ యుద్ధంలో బ్రిటిష్ వారిచే అర్జెంటీనా కు చెందిన అతి పెద్ద యుద్ధ నౌక బెల్‌గ్రానో ను కూల్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇంత పెద్ద యుద్ధ నౌక ఏ యుద్ధ సమయంలో కూడా ధ్వంసం కాలేదు. ఉక్రెయిన్ చేసిన ఈ దాడితో బిత్తరపోయిన రష్యా ప్రతీకారంగా ఉక్రెయిన్ క్షిపణులను తయారు చేసి మరమ్మతులు చేసే ప్లాంట్‌ పై బాంబులు వేసింది.

Related posts

సోషల్ మీడియాలో పెయిడ్ వర్కర్లు లేరు

Satyam NEWS

విశాఖ రేంజ్ లో అమరజీవి కి నివాళులు అర్పించిన డీఐజీ రంగారావు

Satyam NEWS

పుల్వామా అమరవీరులకు ములుగులో ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment