26.2 C
Hyderabad
September 9, 2024 16: 20 PM
Slider తెలంగాణ

వినాయక మండపాలపై దాడులు చేసేవారిని శిక్షించాలి

Rao Padma

వినాయక మండపాలపై దాడులు చేస్తున్న వారిని అడ్డుకోవడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని బిజెపి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆరోపించారు. 6వ తేదీన వరంగల్ ఎల్.బి.నగర్ లో వినాయక మండపం పై ముస్లింలు దాడి చేసిన సంఘటనను నిరసిస్తూ వరంగల్ జిల్లా విశ్వా హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వరంగల్ ఎంజిఎం నుండి పోచమ్మమైదాన్ జంక్షన్ వరకు నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అయితే బీజేపీ నాయకుల బృందాన్ని రాజరాజేశ్వరీ దేవాలయం వద్ద వరంగల్ ఏసీపీ నర్సయ్య ఆధ్వర్యంలో మట్వాడ సీఐ జీవన్ రెడ్డి బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి మట్వాడ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అరెస్ట్ అనంతరం బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతు నిజాం వారసులకు కొమ్ముకాస్తూ కెసిఆర్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ కు ఎంత ధైర్యం ఉంటె యాదాద్రి దేవాలయం పై తన శిల్పాలు చెక్కిస్తారని ప్రశ్నించారు. రాజులు ఈ విధంగా చేసే వారని, ఇపుడు కెసిఆర్ ఆలా చేస్తున్నారని పద్మ అన్నారు. గతంలో పోచమ్మ మైదాన్ లోని శివసాయి ఆలయ పూజారి పై ముస్లింలు దాడి చేసి హతమార్చినా, మొన్నటికిమొన్న శివనగర్ లో వినాయక విగ్రహాన్ని ధంసం చేసినా నిన్న ఎల్ బి నగర్ లోని వినాయక మండపం పై దాడి చేసిన నేటికి ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రంగం కానీ ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకొనకపోవడం వలన రోజురోజుకు హిందువుల పై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గండ్రాతి యాదగిరి, కొలను సంతోష్ రెడ్డి, సంగాని జగదీశ్వర్, మండల సురేష్, పాశికంటి రాజేంద్ర ప్రసాద్, మంతెన రమేష్, మంథాటి వినోద్, కనుకుంట్ల రంజిత్, రత్నం సతీష్ షా, సిద్ధం నరేష్, కొత్త రవి, అమర్నాథ్ రెడ్డి, బోడ విజయ్ కుమార్, నాను నాయక్, రవి నాయక్, నార్లగిరి రామలింగం, జువ్వాడి నర్సింగ రావు, అపరూప సాయిరాం, సుమన్ ఖత్రి, భాస్కర్, పెరుగు సురేష్,పృథ్విరాజ్ గౌడ్, నాగరాజు, స్వినిత్ వర్మ, రాకేష్, వీరేందర్, పవన్, కమల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇళ్ల స్థలాలకు ఇచ్చే అధికారం మీకెక్కడిది?

Satyam NEWS

ఏవి స్వామీ నీవు చెప్పిన విలువలు?

Satyam NEWS

తప్పిన ప్రమాదం.. స్టేషన్ కు చేరిన యవ్వారం….!

Satyam NEWS

Leave a Comment