37.2 C
Hyderabad
April 18, 2024 19: 07 PM
Slider వరంగల్

వార్నింగ్:భూ ఖబ్జాదారులకు మావోల హెచ్చరిక

వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో తెరాస ప్రభుత్వం అండతో పొలీసులు ప్రోద్భలంతో కొద్దిమంది రాజకీయ నాయకులు, రౌడిషీటర్లు, గుండాలు, ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని వరంగల్ పాత ఉమ్మడి జిల్లా మావోయిస్టు కమిటీ కార్యదర్శి వెంకటేష్ అన్నారు.అయన ఈ రోజు విలేకరులకు పంపిన లేక లో వరంగల్‌,రూరల్‌, అర్బన్‌ ల పరిధిలో సాధారణ ప్రజలను బెదిరించి భూకబ్జాలకు సెటిల్‌ మెంట్లకు పాల్బడుతున్న రు.

లంచాలకు తినమరిగినా అధికారులకు ముట్టచెపుతూ తప్పుడు పట్టాలు సృష్టించి రైతులసొంత భూములు నుండి బలవంతంగా గెంటి వేస్తున్నారు. జక్కలొద్దిలో దళితులకు సంబందించినభూములను కోడెల జనార్దన్‌ ఆక్రమించాడు. పగడ పల్లిలో నాదేండ్ల శ్రీధర్‌, రెడ్డి పురం లో రంజిత్‌ రెడ్డి లు పేద రైతుల సాగు భూములను ఆక్రమించి రైతు బంధు పథకంలో ప్రస్తుతం లబ్ది దారులయ్య రు. ఖిల్లా వరంగల్‌ కు చెందినా బిల్లా శ్రీకాంత్‌ రెడ్డి రైతులకు రావాల్సిన చెక్కు లను బినామీలు సృష్టించి అసలురైతుల పొట్టలు కొడుతున్నారు.

వంచన గిరికి చెందిన కొమ్ముల కట్టయ్య శాయంపేట రైతులను ఆక్రమించాడు, బిల్లా రమణా రెడ్డి ఉల్లిగడ్డ దామెర దళితుల భూములను ఆక్రమించాడు, బిల్లారవిందర్‌ రెడ్డి చింతగట్టు ప్రజల భూములను ఆక్రమించాడు,చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు దెడ్డ కుమార్‌ స్వామి, ధర్మారం కొమ్ముల కిషోర్‌, రంగం పేట,వరంగల్‌ జన్ను అనిల్‌, హన్మకొండ కార్పొరేటర్‌ దాస్యం విజయ్‌ భాస్కర్‌, బండ రత్నాకర్‌రెడ్డి అనంత సాగర్‌, పెద్దపురం కోడెపాక సుధాకర్‌, దేవునూరీ రము, మరియు టేకుల గూడెం,ప్రభుదాస్‌ లు వీళ్ళంతా పోలీసుల ప్రోద్బలంతో రౌడీయిజం చేస్తు అమాయక ప్రజలను బెడిరిస్తూ భూసెటిల్‌ మెంట్ల కు పాల్పడుతున్నారు.

ఇప్పటికే వందల ఎకరాల భూములను కబ్జాలు చేసి కోట్ల ఆస్తులుకూడా గట్టారు. సాధారణ ప్రజలు ఏదిక్కు లేక తమ కండ్ల ముందే పూర్తి ఆధారమైన భూమీ కోల్పోయిఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ దుచర్యలకు పాల్పడుతున్నఅక్రమర్కులు, రౌడీలంతా తమ దోపిడి పద్ధతులకు స్వస్తే చెప్పుకుంటే ప్రజలే సరైనా బుద్ది చూపుతారని తెలియజేస్తారని వెంకటేష్ హెచ్చరించారు.

Related posts

శబరిమల యాత్రకు టిఎస్ ఆర్టిసి ప్రత్యేక అద్దె బస్సులు

Satyam NEWS

బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణంతో నూతన శకం

Satyam NEWS

సేఫ్ సైడ్: విశాఖకు కోవిడ్ 19 ప్రమాదం లేదు

Satyam NEWS

Leave a Comment