30.2 C
Hyderabad
February 9, 2025 20: 03 PM
Slider వరంగల్

వరంగల్‌లో అదృశ్యమైన పాతబస్తీ యువతి

old city girl

వరంగల్ రూరల్ జిల్లా, నర్సంపేటలోని లేబర్‌కాలనీకి చెందిన మహ్మద్ జావీద్ కూతురు మదిహా ఫాతిమా (19) ఈనెల 28 ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చి కనిపించకుండా పోయింది. ఆమె కోసం గాలించారు. అయినా ఆమె జాడ తెలియలేదు. చివరకు హైదరాబాద్ పాతబస్తీలోని తమ బంధువుల ఇంటికి వెళ్లొచ్చన్న అనుమానంతో ఈనెల 29న చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఎస్సై వెంకటేష్, మహిళా కానిస్టేబుళ్ళ సహాయంతో జావీద్ బంధువులు నివసించే ఫలక్‌నుమా పోలీసుస్టేషన్ పరిధిలోని జహనుమాలో గల వాళ్ళ ఇంటికి వెళ్ళగా అక్కడ మదిహా ఫాతిమా కనిపించింది. దీంతో ఆమెను క్షేమంగా స్టేషన్‌కు తరలించారు. ఫాతిమా తండ్రి జావీద్ చూపిన ఆధారాలతో సంతృప్తి చెందిన పోలీసులు అతనికి కూతురును అప్పగించారు. అందుకు ఆయన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

దేశంలో హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం

Satyam NEWS

లాస్ట్ ఎర్నింగ్ :వారి చివరి సంపాదన కుటుంబీకులకే

Satyam NEWS

విశాఖ ఉక్కుపై ఉలిక్కిపడిన ఉత్తరాంధ్ర..!!

Satyam NEWS

Leave a Comment