28.2 C
Hyderabad
March 27, 2023 09: 38 AM
Slider తెలంగాణ

కాళోజీ రచనలే తెలంగాణ ఉద్యమ స్పూర్తి

WGL Police

కాళోజీ రచనలే  యువతను తెలంగాణ ఉద్యమవైపు నడిపించాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.వి.రవీందర్‌ అన్నారు. కాళోజీ నారాయణరావు  జయంతి వేడుకలను వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమములో ముందుగా  కాళోజీ చిత్రపటానికి పోలీస్‌ కమిషనర్‌ పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ తన రచన ద్వారా పెత్తదారీ వ్యవస్థ  అన్యాయాలను కాళోజీ ఎదిరించాడాని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాళోజీ రచనలు యువతలో స్పూర్తి రగిల్చాడని అన్నారు. అదే విధంగా యన సామాజిక సమస్యలపై పోరాడిగా మహనీయుడు అని పోలీస్ కమిషనర్ అన్నారు. ముఖ్యంగా కాళోజీ నారయణరావు వరంగల్‌ వారు కావడం మనమందరం గర్వపడాలని తెలిపారు. ఈ కార్యక్రమములో కాళోజీ చిత్రపటానికి నివాళులు అర్పించివారిలో సెంట్రల్‌, ఈస్ట్‌ జోన్ల డి.సి.పి నాగరాజు అదనపు డి.సి.పిలు వెంకటలక్ష్మీ, భీంరావు, ఎ.సి.పి శ్రీనివాస్‌,  శ్రీనివాస్‌ తో పాటు, ఆర్‌.ఐలు సతీష్‌, హతీరాం, నగేష్‌, భాస్కర్‌, ఇన్స్‌స్పెక్టర్లు శ్రీలక్ష్మీ, పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్‌తో పాటు ఇతర పోలీస్‌ సిబ్బంది,పరిపాలన విభాగం అధికారులు ఇతర పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Related posts

6న వైకుంఠ ఏకాద‌శి, 7న వైకుంఠ ద్వాద‌శికి ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

కాపు రిజర్వేషన్లపై ప్రాధేయపడుతూ ముద్రగడ లేఖ

Satyam NEWS

[2022] What Is Hyperlipidemia Type 2 Is Hyperlipidemia The Same As Dyslipidemia

Bhavani

Leave a Comment

error: Content is protected !!