2014కు ముందు ఉమ్మడి ఏపీని నాటి సీఎం వైఎస్ఆర్ పరిపాలన సాగిస్తున్న సమయంలో హైదరాబాద్ లో ఉగ్రవాదుల కదలికలతో కేంద్ర ఇంటలిజెన్స్ హెచ్చరికలతో అప్పట్లోనే ఉలిక్కిపడి ఎస్ఓటీ పోలీసులను అప్రమత్తం చేసింది. తాజాగా తెలంగాణ రాష్ట్రం లో అదీ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన హాయిగా సాగుతున్న సమయంలో ఉగ్రవాదుల కదలిక ఉలిక్కిపడేలా చేసింది. అదీ వరంగల్ లో. వరంగల్‌లో జక్రియా అనే వ్యక్తికి పాకిస్థాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నట్లు కేంద్ర ఇంటలిజెన్స్ గుర్తించడమే కాకుండా ఎస్ఓటీ పోలీసుల సాయంతో వలపన్ని గుర్తించి ఆపై అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు జక్రియాను చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొంతకాలంగా వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జి వద్ద బిర్యానీ సెంటర్ జక్రియా నడుపుతున్నట్టు సమాచారం. అలాగే కొన్నేళ్లుగా పాక్ ఉగ్రవాదులతో జక్రియా సంబంధాలు కొనసాగిస్తున్నట్టు గుర్తించాయి నిఘావర్గాలు.
previous post