39.2 C
Hyderabad
March 29, 2024 16: 59 PM
Slider విశాఖపట్నం

మహిళా సంరక్షక పోలీసులు శాంతిదూతలుగా పని చేయాలి

#vijayanagarampolice

డీఐజీ నుంచీ ఐజీ గా పదోన్నతి పొందిన విశాఖ రేంజ్ ఐజీ రంగారావు… విజయనగరం జిల్లా భోగాపురం సర్కిల్ లో పర్యటించారు. భోగాపురం సర్కిల్ పరిధిలోని భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ పోలీసు స్టేషన్ల పరిధిలలో పని చేస్తున్న మహిళా పోలీసులు (ఎం.ఎస్.పి.)లతో  రేంజ్ ఐజీ,విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక భోగాపురం పోలీసు స్టేషన్ ఆవరణలోనే  మహిళా పోలీసులతో కేక్ కట్ చేయించి, కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా విశాఖ రేంజ్ ఐజి ఎల్.కే.వి.రంగారావు మాట్లాడుతూ ప్రతీ మహిళా పోలీసు గ్రామ,వార్డు స్థాయిలో శాంతిని నెలకొల్పేందుకు శాంతిదూతలుగా పని చేయాలన్నారు. ఈ కొత్త ఏడాది లో నేరాలను నియంత్రించేందుకు క్షేత్ర స్థాయిలో ఐడియల్ పోలీసింగును అమలు చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నామన్నారు.

ప్రతీ గ్రామం,వార్డును పోలీసులు సందర్శించడం సాధ్యం కాదని మహిళా పోలీసులు గ్రామ,వార్డు స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, అసాంఘిక కార్యకలాపాలైన జూదం, గుట్కా, గుడుంబా, గంజాయి నియంత్రణకు సమాచారంను సేకరించి, సంబంధిత పోలీసు అధికారులకు అందించాలన్నారు. గ్రామాల్లో శాంతికి విఘాతం కలిగించే విషయాల పట్ల మహిళా పోలీసులు ముందుగా అప్రమత్తమై, వాటిని ప్రాధమిక స్థాయిలో నిరోధించేందుకు కృషి చేయాలన్నారు.

దిశా యాప్ ఆవశ్యకతను ప్రజలకు వివరించి, ఆపద సమయంలో పోలీసుల సహాయం ఏవిధంగా పొందవచ్చునో ప్రజలకు అర్ధమయ్యే విధంగా అవగాహన కల్పించాలన్నారు. మహిళా పోలీసులు గ్రామ స్థాయిలో సమర్ధవంతంగా పని చేస్తే ఆయా పోలీసు స్టేషను పరిధిలో నేరాలు తగ్గుముఖం పడతాయని ఐజీ ఎల్.కే.వి.రంగారావు అన్నారు. జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ గడిచిన రెండేళ్లుగా ప్రజలకు మహిళా పోలీసులు అందుబాటులో ఉంటూ, నేరాల నియంత్రణలోను, మహిళలు, బాలలకు చట్టపరమైన సహాయాన్ని అందించడంలో ముఖ్యభూమిక పోషించారన్నారు.

ఇదే విధమైన స్ఫూర్తితో కోత్త ఏడాది లో కూడా ప్రజలకు పోలీసులకు మధ్య వారధిగా పని చేసి, పోలీసుశాఖకు మంచి సేవలను అందించి, మహిళలకు అండగా నిలవాలన్నారు. మహిళా పోలీసులు సమర్ధవంతంగా పని చేయడం వలనే రాష్ట్రంలో అత్యధిక మహిళలు దిశా యాప్ ను డౌన్లోడు చేసుకున్నారన్నారు. విధి నిర్వహణలో మహిళా పోలీసులకు ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొని వస్తే, వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక అన్నారు.

మహిళా పోలీసులు మాట్లాడుతూ పోలీసుశాఖతో తాము భాగస్వామ్యం కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించడంలో పోలీసు అధికారులు తమకు అందిస్తున్న సహాయ, సహకారాలకు రేంజ్ ఐజి, జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ మరియు ఇతర పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

భోగాపురం సర్కిల్ లో సమర్ధవంతంగా పని చేస్తున్న మహిళా పోలీసులు జి.వి. అపర్ణ, బి. శాంతివర్ధిని, ఎం. వాసవీ పద్మావతిలకు  రేంజ్ ఐజీపి ఎల్.కే.వి.రంగారావు,జిల్లా ఎస్పీ దీపికా  ప్రశంసా పత్రాలను అందజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎం. దీపిక, విజయనగరం సబ్ డివిజన్ అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి, భోగాపురం సీఐ విజయనాధ్, ఎస్ఐలు మహేష్, జయంతి, పద్మావతి, నర్సింగరావు, మహిళా పోలీసులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

Satyam NEWS

వై ఎస్ షర్మిల గారూ ఆంధ్రా బిడ్డగా ఒక సారి మమ్మల్ని చూడండి

Satyam NEWS

యూరియా కోసం రైతుల పడిగాపులు

Satyam NEWS

Leave a Comment