హరితహరం కార్యక్రమంలో భాగంగా బిచ్కుంద మండలంలో నాటిన మొక్కలకు నీరు పోసే కార్యక్రమం ప్రతి శుక్రవారం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలైన గోపన్పల్లిలో సర్పంచ్ శ్రీనివాస్, బండరెంజల్ లో సర్పంచ్ గడ్డం బాలరాజ్, పెద్దదడిగి లో సర్పంచ్ ఆకుల సాయిలు, గుండె కల్లూరులో సర్పంచ్ సంగీత మొక్కలకు నీరు పోశారు. అదే విధంగా రాజులలో సర్పంచ్ చంద్రభాగ, ఫథలాపూర్లో సర్పంచ్ అరుణ్ కుమార్, చిన్న తడిగి లో సర్పంచ్ అనిత, పెద్ద దేవాడలో సర్పంచ్ శివ నందప్ప, వాజిద్నగర్లో సర్పంచ్ అనుయ మొక్కలకు నీరు పోశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ ఆనంద్ ఎంపీఓ మహబూబ్లు ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
previous post