27.7 C
Hyderabad
April 26, 2024 04: 24 AM
Slider ముఖ్యంశాలు

అయోధ్య రామాలయానికి అమరావతి మట్టి నీళ్లు

#Save Amaravathi

కృష్ణ, గుంటూరు జిల్లాల ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి యువజన  అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ మహిళా ప్రతినిధి వేగుంట రాణి డిమాండ్ చేశారు. ఈ నెలఐదో  తారీకున అయోధ్య  రామమందిరం శంకుస్థాపన జరుగుతున్న సందర్భంగా అమరావతి రాజధాని శంకుస్థాపన ప్రాంతంనుండి  పవిత్ర మట్టిని కృష్ణ గోదావరి పవిత్ర నదుల జలాలను ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సేకరించి అయోధ్యకు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో  అభివృద్ధి నిరోధక పాలన నుండి  పాలకుల మనసు మారాలని కోరుకుంటున్నామన్నారు. ఇప్పటికైనా కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజా ప్రతినిధులు రాజీనామా చేసి అమరావతి రాజధాని కోసం పోరాటంలో చేయి చేయి కలపాలని పార్టీలకతీతంగా తిరిగి మళ్లీ గెలిపించుకునే లా ఐకమత్యంతో కృషి చేస్తామని లేకుంటే ప్రజాక్షేత్రంలో తిరుపతి చరిత్ర హీనులుగా   నిలుపుదాం అన్నారు.

ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ మహిళా ప్రతినిధి వేగుంట రాణి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసే నిర్ణయాలను నుంచి పాలకుల మనసు మారి రామ రాజ్య స్థాపన కోసం ప్రయత్నం జరగాలని అన్నారు. రాజధాని కోసం జరుగుతున్న పోరాటానికి  న్యాయదేవతకు అండగా దైవబలం కూడా సమకూర్చాలని   కాంక్షిస్తూ అయోధ్యలో 5వ తారీఖున జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి అమరావతి నుండి పవిత్ర నదీ జలాలు పవిత్ర మట్టి నీ పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నాయకులు  దండ మిధున్ మన్నెం శ్రీనివాసరావు  దాసు పద్మావతి అమరావతి  రైతు జేఏసీ నాయకులు పులి చిన్న దండమూడి మహేశ్వరరావు కే సీతారావమ్మ  కారుమంచి శైలజ ఉద్దండరాయునిపాలెం మహిళా జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

క్లియర్ కట్ :శరణార్థులను ఆదుకోవడానికే సీఏఏ కిషన్‌రెడ్డి

Satyam NEWS

హైదరాబాద్ నగరాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధకు కృతజ్ఞతలు

Satyam NEWS

మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

Satyam NEWS

Leave a Comment