28.7 C
Hyderabad
April 24, 2024 03: 03 AM
Slider జాతీయం

కాంట్రవర్సీ: జవాన్ కిసాన్ మధ్య ఎడతెగని పోరు

Sagar_City

భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్, జై కిసాన్ అన్నారు. దేశానికి ఇద్దరూ అవసరమే. ఒకరు లేకపోతే భద్రత ఉండదు మరొకరు లేకపోతే జీవితమే ఉండదు. అలాంటి ఇద్దరూ పోట్లాడుకుంటే? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అదే జరుగుతున్నది.

భోపాల్ కు 186 కిలోమీటర్ల దూరంలో సాగర్ కంటోన్మెంట్ ఉంది. ఇది అతిపెద్ద కంటోన్మెంట్. ఈ ప్రాంతంలో చితోరా డ్యామ్ ఉంది. ఈ చితోరా డ్యామ్ కింద దాదాపు 12 గ్రామాల ప్రజలు సాగు చేసుకుంటున్నారు. డ్యామ్ నుంచి నేరుగా, కాల్వల నుంచి నేరుగా నీటిని తీసుకుని అక్కడ రైతులు తమ పొలాలను సాగు చేసుకుంటూ ఉన్నారు.

ఇప్పడు ఆ డ్యామ్ లో నీటి మట్టం పెద్దగా లేదు. దాంతో అక్కడి కంటోన్మెంట్ వారికి నీటి ఎద్దడి ఏర్పడింది. తమ నీటి ఎద్దడిని తీర్చడం కోసం వారు డ్యామ్  నుంచి రైతులు నీరు తీసుకోకుండా అడ్డుకుంటున్నారు. దాంతో 12 గ్రామాల రైతులు రోడ్డుమీదికి వచ్చారు. కంటోన్మెంట్ నీటి అవసరాలు తీర్చడం ముఖ్యం కనుక ఆర్మీ ఆ డ్యామ్ లోని నీటిని కాపాడుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దాంతో ఒక బెటాలియన్ సైన్యాన్ని రంగంలో దించారు.

నీటిని తోడుకునే రైతులను అడ్డుకుంటున్నారు. వారు బిగించుకున్న పంపులను ఎత్తుకెళుతున్నారు. ఇంకా రైతుల అరెస్టు వరకూ రాలేదు కానీ నేడే రేపో ఆ పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు అంత ఉద్రిక్తంగా అక్కడి పరిస్థితిలు నెలకొని ఉన్నాయి.  చొతోరా గ్రామ సర్పంచ్ విజేంద్ర సింగ్ మాట్లాడుతూ సైనికులు తమకు నీటి సరఫరా నిలిపివేశారని, ఇది దారుణమని అన్నారు. డ్యామ్ నీళ్లు కాల్వలల్లోని నీళ్లు తీసుకోకుండా అడ్డుకుంటే తమ పరిస్థితి ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు.

సాగర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు కంటోన్మెంట్ కోసం ప్రత్యేకంగా 1995 లో నిర్మించిన డ్యామ్ ఇది అని సైనికాధికారులు చెబుతున్నారు. పోనీలే రైతులు కదా అని తాము వదిలేస్తుంటే ఎక్కవ నీటిని డ్రా చేస్తున్నారని దీనివల్ల కంటోన్మెంట్ కు నీటి సమస్య ఎదురవుతున్నదని అంటున్నారు. మా నీటిని మేం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సాగర్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కామాండెంట్ కల్నల్ మనీష్ గుప్తా తెలిపారు.

ఈ డ్యామ్ నుంచి కంటోన్మెంట్ కు నీళ్లు ఇస్తున్న మాట వాస్తవమేనని అయితే రైతుల కు కూడా నీరు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ అంశంపై పూర్తి విచారణ జరుపుతామని సాగర్ మునిసిపల్ కమిషనర్ ఆర్ పి ఆహిర్వర్ అన్నారు. విషయం ఇంతటితో ఆగదని పెరిగి పెద్దవుతుందని అంటున్నారు.

Related posts

హైదరాబాద్ కు ప్రారంభమైన విమానాల రాకపోకలు

Satyam NEWS

జ్యోతిబా పూలే కు మంత్రి ఈటెల రాజేందర్ ఘన నివాళి

Satyam NEWS

శబరిమలలో మహిళల ప్రవేశంపై యథాతధ పరిస్థితే

Satyam NEWS

Leave a Comment