ఎడతెరిపిలేకుండా గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో కర్నూలు జిల్లాలో కొలువైన స్వయంభూ మహా నందీశ్వర స్వామి జల దిగ్బంధంలో చిక్కకున్నాడు. ఈ క్షేత్రంలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు, ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. మహానందిలోని మూడు కోనేర్లూ నిండిపోయి, నీరు ఎగువకు ప్రవహించి, లోతట్టు ప్రాంతాలను జలమయం చేసింది. వందలాది ఎకరాల్లోని అరటి తోటల్లోకి నీరు ప్రవేశించింది. ఆలయంలో మొదటి, రెండో ప్రాకారంలోకి ప్రవేశించిన వరద నీరు, ఆపై పంచలింగాల మంటపాన్నీ ముంచెత్తగా, ఆలయ అధికారులు దర్శనాలు రద్దు చేశారు. రుద్రగుండం కోనేరులో వరద ఉద్ధృతికి పంచలింగాలూ మునిగిపోయాయి. మరోవైపు పాలేరు వాగు ఉద్ధృతితో నంద్యాల – మహానంది మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు తగ్గే వరకూ భక్తులు ఆలయానికి రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
previous post