28.2 C
Hyderabad
April 20, 2024 14: 03 PM
Slider రంగారెడ్డి

నీరు సకల చరాచర జీవులకు అత్యంత ఆవశ్యకం

#worldwaterday

ప్రపంచ నీటి దినోత్సవం సందర్భం గా సిబిఐటి – సివిల్ ఇంజినీరింగ్ విభాగం, చైతన్య పరివృత క్లబ్‌ సంయుక్తం గా  నీటి సంరక్షణ కోసం  తక్షణ కర్తవ్యాలు అనే అంశం పై సదస్సు నిర్వహించారు. మెరుగైన నీటి సంరక్షణ కోసం తక్షణ కర్తవ్యాలు అనే అంశం పై అతిథులు ఉపన్యాసం ఇచ్చారు.

సివిల్ విభాగధిపతి ప్రొఫెసర్  కె. జగన్నాధ రావు ఈ స్వాగతపన్యాసం చేసారు. సదస్సులో పాల్గొన్న వక్తలు అధ్యాపకులకు విద్యార్థులకు ప్రపంచ నీటి దినోత్సవం ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ  కార్యక్రమం ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమెరిటస్ ప్రొఫెసర్, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రిటైర్డ్ ఇంజనీర్-ఇన్-చీఫ్ డాక్టర్ పి రామరాజు హాజరయ్యారు.

డాక్టర్ రాజు మాట్లాడుతూ నీరు, నీటి పారిశుద్ధ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రస్తుత వున్న నియమాలు, నిబంధనలలో  మార్పును తీసుకురావాల్సి ఉందని సూచించారు. సరైన రీతి లో నీరు లభించకపోతే  ఆ దేశ పురోగతి  క్షీనిస్తుంది.  ప్రజల ఆరోగ్యం, ఉద్యోగాలు, విద్య , పరిశ్రమలు, సంక్షోభాన్ని ఎదురుకోవాలిస్తుంది.  ఆందువల్ల నీరే మనకు ఆధారం. మన దగ్గర వున్న నీటిలో 97 శాతం సముద్రం లో వున్నది.

మనందరికి తెలుసు సముద్రపు  నీరు చాల ఉప్పగా ఉంటుంది. అది త్రాగడానికి ఉపయోగించే వీలు ఉండదు. మిగిలిన 2.5 శాతం మంచినీరు చాలా వరకు హిమానీనదాలు, ధ్రువ మంచు గడ్డలలో వున్నది. దీని ఫలితంగా భూమి దగ్గర వున్నా  నీటిలో 1 శాతం కంటే తక్కువ మాత్రమే త్రాగడానికి అందుబాటులో ఉంది. అంతేకాకుండా, భూమి నీటి సరఫరా స్థిరంగా ఉంటుంది.

అందుకే మానవ సమాజం ఆరోగ్యం, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ భూ గ్రహం పర్యావరణ వ్యవస్థ సేవలను నిర్వహించడం కోసం దీనిని సంరక్షించడం, స్థిరంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. నదీజలాలు, ఎల్నినో కారణంగా వచ్చే  నీటి సంక్షోభంపై మనం దృష్టి సారించాలి అని అన్నారు. తాగునీరు మరియు పారిశుద్ధ్య సేవలు, ఆహార ఉత్పత్తి, శక్తి ఉత్పత్తి, లోతట్టు నీటి రవాణా మరియు నీటి ఆధారిత వినోదం, అలాగే మంచి  నీటిని నిలబెట్టుకోవడం కోసం తగిన నాణ్యత గల నీరు తగినంతగా ఉందని నిర్ధారించడం ద్వారా స్థిరమైన నీటి వనరుల నిర్వహణ నీటి ప్రయోజనాలను వినియోగించుకోవడం ఎంతో అవసరం అని చెప్పారు.

చైతన్య పరివృత క్లబ్ ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్, సహాయక ఆచార్య ఇ. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నీటి కొరత వలస  జీవవైవిధ్యం కోల్పోవడం వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. జంతువులు, మొక్కలు, మానవులు కూడా తగినంత నీరు పొందలేని కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్లవలసి ఉంటుంది లేదా చనిపోవచ్చు లేదా అంతరించిపోయే ఆవకాశం వున్నది అని అన్నారు. కార్యక్రమ చివరి లో స్టూడెంట్ కో-ఆర్డినేటర్ ఒగ్గు అక్షిత ప్రియ  అధ్యాపకులకు మరియు విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

నల్లగొండ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

Bhavani

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం మూడు లాంత‌ర్ల జంక్ష‌న్ నుంచి హెరిటేజ్ వాక్

Satyam NEWS

Leave a Comment