40.2 C
Hyderabad
April 19, 2024 18: 53 PM
Slider నిజామాబాద్

నిండిన ప్రధాన కాలువ:పట్టించుకోని నీటి పారుదల అధికారులు

#drainage system

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని  అన్నదమ్ముల చెరువు నుండి కమ్మరి చెరువుకు వెళ్లే ప్రధాన కాలువ   కాల్వ పక్కన ఉన్నవారు ఎక్కడికక్కడే  కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో  కాల్వ నుండి నీటి ప్రవాహం తగ్గి   దోమలకు పందులకు నిలయంగా మారింది.

దీంతో రాత్రి వేళలో విషజీవులు కూడా సంచరిస్తున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. గతంలో ఈ కాలువ పునరుద్ధరణ పనుల కొరకు సంబంధిత నీటిపారుదలశాఖ అధికారులు పంచాయతీ అధికారులు సర్వే లు చేసారు కానీ నిర్మాణ పనులు మాత్రం చేపట్టలేదు.

దీంతో ఈ ఏడాది ప్రారంభ దశలోనే వర్షాలు భారీగా కురవడంతో  కాలువ నీరు చెరువులోకి వెళ్లకుండా కాలువ కట్ట తెగిపోయి పలు కాలనీలోకి వెళుతున్నాయి. దీంతో పలు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి కబ్జాలు తొలగించి కాల్వ పునరుద్ధరణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

జి.లాలయ్య, సత్యం న్యూస్, జుక్కల్

Related posts

క‌రోనా భ‌యం..అందుకే అదుంటే ఎంతో అభ‌యం..!…ఏమిట‌ది..?

Satyam NEWS

అక్రమ కేసులు భరించలేక పాలేరు ఎమ్మెల్యే పై తిరుగుబాటు

Satyam NEWS

జూనియర్ ఎన్టీఆర్ పేలవమైన ట్వీట్ పెట్టడానికి కారణం ఏమిటి?

Satyam NEWS

Leave a Comment