36.2 C
Hyderabad
April 25, 2024 22: 35 PM
Slider మహబూబ్ నగర్

పానగల్ బ్రాంచి కాలువ ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు అందాలి

#pangal canal

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం లోని కోడేరు మరియు పానగల్ మండలం లోని అన్ని గ్రామాలకు పానగల్ బ్రాంచి కాలువ ద్వారా సాగు నీరు అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్  రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో పానగల్ బ్రాంచి కాలువ నీటి విడుదల, కల్వకుర్తి ఎత్తిపోతల కింద ఉన్న పలు కాలువలపై ఆయన  సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి , ఎస్ఈ విజయ భాస్కర్ రెడ్డి , ఈఈలు రవీందర్, సంజీవ రావు, డీఈ  సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పానగల్ బ్రాంచి కాలువ పొడువునా ఉన్న సిల్ట్ మట్టిని, కాలువ పై ఏపుగా పెరిగిన  చెట్లను తీసి వేసి  కాలువ ద్వారా నీరు సులభంగా అందించేందుకు కావలసిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పానగల్ బ్రాంచి కాలువ పై గల అన్ని కాలువల తూము లకు గేటు లను బిగించి నీటి వృధా ను అరికట్టాలని ఆయన కోరారు. పానగల్ బ్రాంచి కాలువ కింద పెరిగిన ఆయకట్టు ను అంచనా వేసి దానికి తగినట్టుగా లైనింగ్ ప్రతిపాదనలు తాయారు చేసి ప్రభుత్వానికి పంపాలని అధికారులకు ఆదేశం జారీ చేశారు.

Related posts

బిచ్కుందలో జాగృతి అధ్యక్షురాలి జన్మదిన వేడుకలు

Satyam NEWS

ఎన్ డి ఏ లో చేరేందుకు ప్రాధేయపడుతున్న జగన్

Satyam NEWS

దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఉగ్రవాదుల కదలిక

Satyam NEWS

Leave a Comment