కేరళలో వరదలు కారణంగా మరణించిన వయనాడ్ వరద బాధితులను ఆదుకోవాలనీ, జరిగిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఎం విజయనగరం సమితి ఆధ్వర్యంలో నగరంలోని తోటపాలెం,ఆర్టీసి కాంప్లెక్స్ ప్రాంతంలో వ్యాపారులు,ప్రజల నుంచి వయనాడ్ బాధితులకు నిది వసూలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ రాష్ట్రం వయనాడ్ లో జరిగిన విపత్తు కారణంగా 300 కుటుంబాలు మరణించడం జరిగిందన్నారు. వందల మంది క్షత గాత్రులై ఆసుపత్రి పాలయ్యరన్నారు.
జాతీయ పరిశోధన సంస్థకు కూడా అందని విధంగా నష్టం జరిగిందన్నారు. కేంద్రం ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను పంపించినప్పటకి దానిని రాజకీయం చేయడం దుర్మార్గమన్నారు.వెంటనే కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని విధాల ప్రజలను,వరద బాధితులను,కుటుంబాలను ఆదుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తమిళనాడు,కర్ణాటక ప్రభుత్వాలు సహాయం చేస్తున్నాయన్నారు.అదే విధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వయనాడ్ బాధితులకు సహకారాన్ని అందించాలని కోరారు.
సిపిఎం దేశ వ్యాప్తంగా వయనాడ్ బాధితులకు అండగా నిలిచేందుకు విరాళాలు సేకరణ చేయడం జరుగుతుందన్నారు.అందులో భాగంగానే విజయనగరం జిల్లాలో పార్టీ శాఖలన్నీ నిది వసూలు చేసి వయనాడ్ బాధితులకు అండగా నిలిచేందుకు విరాళాలు సేకరణ చేయడం జరుగుతుందన్నారు.జిల్లాలో అన్ని వర్గాలు ప్రజలు సహాయ సహకారాలు అందించి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సి పీ ఎం జిల్లా తమ్మినేని సూర్యనారాయణ,నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు, నాయకులు ఏ.జగన్మోహన్, కే.సురేష్, సి హెచ్ వెంకటేష్, డి.రాము, యు ఎస్ రవికుమార్,బి.రమణ,,అర్ ఆనంద్ ,హరీష్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.