36.2 C
Hyderabad
April 25, 2024 21: 32 PM
Slider ప్రత్యేకం

జర్నలిస్టుల సంక్షేమానికి మేం కట్టుబడి ఉన్నాం

#MinisterKTR

జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వ కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చనిపోయిన జర్నలిస్టుల పిల్లలను రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదివిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

ఆదివారం నగరంలోని జలవిహార్‌లో టీయూడబ్ల్యూజే సభ్యులతో జరిగిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తానే తీసుకుంటున్నానని అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు అడ్డుంకులున్నాయని వాటిని కూడా చూస్తానని హామీ ఇచ్చారు.

టీఆర్‌ఎస్‌ లేనిదే టీకాంగ్రెస్‌, టీబీజేపీ ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ‘సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర నాయకులు తెలంగాణ వాళ్లను గంజిలో ఈగలా తీసిపడేశారు. ఆరేండ్లలో కరెంట్‌ సమస్య పోయింది. ఇంటింటికి తాగునీరు వచ్చింది. ఫ్లోరోసిస్‌ బాధపోయింది.. 10 మెడికల్‌ కళాశాలలు వచ్చాయి.

కేంద్రానికి రూ. 2.72 లక్షల కోట్లు పన్నులు కడితే, మనకు వచ్చింది సగమే’ అని కేటీఆర్‌ అన్నారు. ఈ సందర్భంగా 260 మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున మంత్రి కేటీఆర్‌ చెక్కులు పంపిణీ చేశారు. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. 

Related posts

బిచ్కుంద మండలంలో అంబేద్కర్ వర్ధంతి

Satyam NEWS

తీర ప్రాంత గ్రామాల్లో ప‌ర్య‌టించిన స‌త్యం న్యూస్.నెట్…

Satyam NEWS

విశాఖ నుంచి తెలంగాణ మంత్రి మాట్లాడుతూ…

Satyam NEWS

Leave a Comment