28.7 C
Hyderabad
April 20, 2024 05: 47 AM
Slider జాతీయం

పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనానికి మేం రెడీ

#upendradwivedi

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి తీసుకోవడానికి భారత్ ప్రయత్నిస్తుందా? 1971లో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన యుద్ధ సమయంలో కోల్పోయిన భూ భాగాన్ని తిరిగి తెచ్చుకునే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఇటీవల ఎన్నికల పర్యటన కోసం హిమాచల్‌ ప్రదేశ్ కు వెళ్లిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.

భారత ఆర్మీ ఉత్తర కమాండ్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మంగళవారం మాట్లాడుత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారత సైన్యం సిద్ధమేనని సంచలనాత్మక ప్రకటన చేశారు. భారత ప్రభుత్వ ఉత్తర్వు కోసం ఎదురుచూస్తున్నామని ఆయన అన్నారు.

ఇదొక్కటే కాదు భారత ప్రభుత్వం నుంచి ఏ ఆదేశాలు వచ్చినా అమలు చేయడానికి తాము సిద్ధమేనని ఆయన అన్నారు. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ, భారత సైన్యానికి సంబంధించినంత వరకు, భారత ప్రభుత్వం ఇచ్చే ఏవైనా ఆదేశాలను అది అమలు చేస్తుందని చెప్పారు.

Related posts

కళ్యాణం కమనీయం శ్రీ సీతారాముల కళ్యాణం

Satyam NEWS

సైబర్ నేరాల నియంత్రణలో అవగాహనే ప్రధాన ఆయుధం

Satyam NEWS

విజయనగరం పోలీసుల అదుపులో పగటి దొంగ…!

Bhavani

Leave a Comment