30.7 C
Hyderabad
April 19, 2024 09: 12 AM
Slider ముఖ్యంశాలు

అవినీతిపై ప్రశ్నిస్తే బెదిరింపులు: సతీష్ యాదవ్

#satishyadav

వనపర్తిలో  మూడు సంవత్సరాలనుండి అఖిల పక్ష ఐక్యవేదిక  పలు సమస్యలపై, అవినీతిపై   ప్రశ్నిస్తుంటే రానటువంటి బెదిరింపులు, ఒత్తిడిలు ప్రస్తుతం వస్తున్నాయని కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ తెలిపారు. అన్ని శాఖలపై ప్రశ్నించామని, నాయకులపై  ప్రశ్నించామని, వ్యవస్థలపై ప్రశ్నించామని ఆయన చెప్పారు.

మమ్మల్ని నిర్వీర్యం చేస్తాం అంటూ వివిధ పార్టీ నాయకులతో, వివిధ రంగాలలో ఉన్న అధ్యక్షులతో మాట్లాడాడుతూ, మమ్మల్ని భయపెట్టే విదంగా ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు.  ప్రభుత్వ దవాఖానాలలో  వసతులు లేవని,  ప్రభుత్వ దవాఖానాల్లో స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ ను కోరామన్నారు. వనపర్తిలో  కొందరు బ్రోకర్లు మా అఖిలపక్ష ఐక్యవేదిక సభ్యులను విడదీయడానికి ప్రయత్నాలు చేస్తూ వారి వద్దకు వెళ్లి ఇక నుండి మీరు పోవద్దు, మీ అధ్యక్షున్ని ఒంటరి చేయండి అని చెబుతున్నారని ఆయన తెలిపారు.

 ఎందుకు? ఆలోచించండి? ప్రజలారా వనపర్తిలో  మాఫియా, ఎంత దూరం పోయింది, ఎవరెవరిని కూడబెట్టింది, వీళ్ళకి ఎంత మూట్టచెపుతుంది,  ఎవరిని ఎవరు రక్షిస్తున్నారు, వీరు రాజకీయ నాయకులను కూడా  శాసించే స్థితికి వెళ్తున్నారా అని ఆయన అన్నారు. ఈ బెదిరింపులతో ఆగేది లేదని, అవినీతిని, సమస్యలను మాత్రమే ప్రస్తావించాలని,  మేము వ్యక్తిగతంగా ఎవ్వరిపై ఫిర్యాదులు చెయ్యలేదన్నారు. 

ఎవ్వరిని విమర్శించం,ఎవ్వరితో లాలూచిపడం,  కానీ మమ్మల్ని  మమ్మల్ని బెదిరించినా, బెదిరేదిలేదని ఆయన చెప్పారు. ప్రజలకోసం ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడాలని మిత్రులు అందరూ కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయమన్నారు. ప్రజలు హర్షిస్తారని, వారి దీవెనలతో, మమ్మల్ని ముందు నుండి ప్రోత్సహిస్తున్న పత్రిక మిత్రులకు  ధన్యవాదాలు తెలిపారు. అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుని, నిజాయితీకి సలాం కొడుతున్నామని ఆయన తెలిపారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

దేవీ ఫోటో స్టూడియో చోరీ ఘ‌ట‌న‌లో జువైన‌ల్ పాత్ర‌

Satyam NEWS

ఆదానీ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలి

Bhavani

రామప్ప ఆలయ పూజారులకు, గైడ్ లకు సన్మానం

Satyam NEWS

Leave a Comment