37.2 C
Hyderabad
April 18, 2024 21: 25 PM
Slider నిజామాబాద్

ఎల్ఈడీ బల్బుల నిర్వహణ ప్రైవేటుకు అప్పజెప్పొద్దు

#LEDBulbs

తమపై పనిభారాన్ని తగ్గించడంతో పాటు ఎల్ఈడీ వీధి దీపాల ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా సర్పంచులు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే దారిలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినా వాటిని తోసుకుంటూ వెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు. సుమారు మూడు గంటల నుంచి ఆందోళన కొనసాగింది. కలెక్టర్ బయటకు రావాలని కలెక్టర్ కు వ్యతిరేకంగా సర్పంచులు నినాదాలు చేశారు.

గ్రామాల్లో ఎల్ఈడీ బల్బుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని నిరసించారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని, ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి రహదారిపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా వాటిని తోసుకుని సర్పంచులు ముందుకెళ్లారు. కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కలెక్టర్ బయటకు రావాలని నినాదాలు చేశారు.

మాకు గౌరవం ఇవ్వరా

పోలీసులు జ్యోక్యం చేసుకుని కొంతమంది మాత్రమే వెళ్లి కలెక్టర్ తో మాట్లాడాలని పోలీసులు సర్దిచెప్పడానికి ప్రయత్నించడంతో సర్పంచులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ ప్రథమ పౌరులమైన తాము ఎండలో మూడు గంటలుగా కూర్చున్నా తమకు కనీస గౌరవం ఇవ్వాలని కూడా కలెక్టర్ కు అనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రామ పంచాయతీలకు భారం

ఈ సందర్బంగా సర్పంచులు మాట్లాడుతూ..  ఎల్ ఈడీ బల్బుల నిర్వహణ ప్రైవేటీకరణ చేయడం వల్ల గ్రామ పంచాయతీలకు అదనపు భారం కలుగుతుందని, వెంటనే దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జుక్కల్ మండలంలో రూర్బన్ పథకం కింద ప్రైవేటుకు అప్పజెప్పి పరీక్షించామని, అనుకున్న రీతిలో ఫలితాలు రావడం లేదన్నారు.

పల్లె ప్రగతిలో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు పెండింగులో ఉన్నాయని, గ్రామాల్లో బడ్జెట్ లేకపోవడంతో పుస్తెలు తాకట్టు పెట్టి అప్పు చేసి పనులు చేయించామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లోకి కలెక్టర్ వచ్చినప్పుడు కార్యాలయం వద్దకు రాకుండా సర్పంచులను రోడ్లపైనే నిలబెట్టి పనులు చేయకపోవడానికి బాధ్యులను చేస్తూ మెమోలు జారీ చేయడం సరికాదన్నారు.

కలెక్టర్ బయటకు వచ్చి తమతో చర్చించాలని కలెక్టర్ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. సుమారు నాలుగు గంటల పాటు ఆందోళన అనంతరం డిఎస్పీ చొరవతో సుమారు 20 నుంచి 30 మంది సర్పంచులు కలెక్టర్ వద్దకు వెళ్లి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

Related posts

వైఎస్ జగన్ వ్యవహార శైలిపై కేఏ పాల్ ఆగ్రహం

Satyam NEWS

ఏప్రిల్ 2 న తెలుగులో వస్తున్న “లెగసి ఆఫ్ లైస్”

Satyam NEWS

విశ్వసేవిక ట్రస్ట్ వృద్ధాశ్రమంలో నిత్యావసరాల పంపిణీ

Satyam NEWS

Leave a Comment