20.7 C
Hyderabad
December 10, 2024 01: 31 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

సమస్యలు సృష్టించం-పరిష్కరిస్తాం

RTR42I0B

ఏ సమస్యను సృష్టించం. ఏ సమస్యను పెండింగ్ లో ఉంచం- అని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ పై చట్టం విషయాలను ప్రస్తావిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. తన భవిష్యత్ గురించి తనకు దిగులు లేదని దేశభవిష్యత్తే ముఖ్యమని ఆయన అన్నారు. దేశం మారబోతుందన్న భావన అందరిలోనూ ముఖ్యంగా యువతలో ఉందని ఆయన తెలిపారు. రాబోయే ఐదేళ్లలో పటిష్టమైన భారత్ ను నిర్మించాలనే ఆకాంక్షతో లక్ష్యాలు నిర్దేశించుకుంటూ పయనిస్తామని ప్రధాని మోడీ తెలిపారు. ఇప్పటికే అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టినట్లు ఆయన తెలిపారు. దేశంలో నీటి కొరత ఉందని, దాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వందేళ్ల క్రితం చెప్పినట్లు నీళ్లను షాపుల్లో అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగేందుకు నీరు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను తాను చూసినట్లు తెలిపారు. అందులో భాగంగా సాగు, తాగు నీటి వనరుల కోసం జల్ జీవన్ మిషన్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రూ.3.5లక్షల కోట్లతో ప్రతీ ఇంటికి నీరందించనున్నట్లు ప్రధాని తెలిపారు. స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛ్ వాటర్ అందిస్తామన్నారు. ఆధునిక మౌలిక సదుపాయాల కో సం రూ.1000లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు పేదలను కేవలం ఓటు బ్యాంకుగా పరిగణించాయని వారి అభివృద్ధికి పాటుపడలేదన్నారు.ఇప్పటికీ పేదలకు ఇల్లు, కట్టుకునేందుకు వస్త్రాలు, టాయిలెట్లు కూడా లేని పరిస్థితి ఉందని వారందరి అభివృద్ధఇకి కట్టుబడి ఉన్నామన్నారు. మరోవైపు ఐదేళ్లలో భారత్ ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లు సాధించిందని, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ప్రజల కోరిక మేరకు ఎయిర్ పోర్టులు, ఫైవ్ స్టార్ రైల్వే స్టేషన్లు కూడా మరిన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ ను ఒడిసి పట్టుకున్నట్లు స్పష్టం చేశారు. దేశంలోని ప్రతీ జిల్లా ఎగుమతి కేంద్రంగా తయారుకావాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. దేశం పర్యాటకులకు స్వర్గధామం కావాలని ప్రధాని కోరారు. భారత శక్తి సామర్ధ్యాలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే వైద్యఆరోగ్య రంగాలలో సమూల మార్పులు తీసుకువచ్చామని, ఎన్నో సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ఆయుస్మాన్ భారత్ దేశప్రజలకు ఒక వరం అంటూ కొనియాడారు. వైద్యాన్ని ప్రతీ సామాన్యుడికి అందుబాటులోకి తేవాలన్నదే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ప్రతీ ఒక్కరికి ఇల్లు ఉండాలన్నదే తన సంకల్పం అని ప్రధాని అన్నారు.

Related posts

ఘనంగా కాటమయ్య పండుగ

Bhavani

లాస్ట్ ఎంక్వయిరీ:రాధిక హత్య ఇంటి దొంగల పనేనా

Satyam NEWS

సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

Murali Krishna

Leave a Comment