జాతీయ మహిళా కమీషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా కమీషన్ వన్ స్టాప్ కేంద్రాలను సందర్శిస్తోందని అందులో భాగంగా తాను విజయనగరంలో ఉన్న ఏకైక వన్ స్టాప్ కేంద్రాన్ని సందర్శించానని రాష్ట్ర మహిళా కమీషన్ సభ్యురాలు ఉమ అన్నారు. విజయనగరం కంటోన్మెంట్ బ్యారెక్స్ వద్ద గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన వన్ స్టాప్ కేంద్రాన్ని కమీషన్ సభ్యురాలు ఉమ ఆకస్మికంగా తనిఖీ చేసారు.
ఈ సందర్భంగా సెంటర్ కు వచ్చిన నగరంలోని గోక పేటకు చెందిన ఆలుమగలకు కమీషన్ సభ్యురాలు ఉమే స్వయంగా కౌన్సలింగ్ ఇచ్చారు.కేంద్రానికి వచ్చిన భార్యభర్తలను కలపడానికి,వారిద్దరి మధ్య అపార్దాలను ఓ జాతీయ మహిళా కమీషన్ గా నివృత్తి చేయడమే మా బాధ్యత అని ఆమె అన్నారు.అనంతరం రాష్ట్ర మహిళా కమీషన్ సభ్యురాలు గద్దె ఉమ వన్ స్టాప్ కేంద్రాన్ని మొత్తం పరిశీలించారు. .ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు,సంక్షేమ శాఖ ఏడీ, మహిళా ఏఎస్ఐ శోభారాణిలు వన్ స్టాప్ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నాలుగు జిల్లాలను చూస్తూ ఉంటానని చెప్పారు.
వర్క్ ప్లేస్ వేధింపులలో గ్రూప్ వన్ కేటర్…జాతీయ స్థాయి కమీషన్ లో సభ్యలు పరిష్కరిస్తారని చెప్పారు. ఒకానొక సందర్బంలో వర్క ఫర్ ప్లేస్ లలో సబంధిత శాఖలకు అప్పగిస్తామన్నారు. మా పరిధిలో కౌన్సలింగ్ ఇస్తామని చెప్పారు.మాకు నేరుగా వచ్చిన కేసులు, ఉమన్ అండ్ చైల్డ్ శాఖ పరంగా కేసులన పరిష్కరిస్తామన్నారు. మా వంతు శక్తి వంచన లేకుండా తచ్చిన తగవులను పరిష్కారిస్తామని చెప్పారు.ఇక వన్ స్టాప్ సెంటర్లు ఎన్ని ఉండాలి,ఎన్ని అవసరమే చూడటానికి కమీషన్ ఆదేశాల మేరకు జిల్లాకు వచ్చామని చెప్పారు.
ఇక శాఖ పరంగా లీగల్,ఆ సహాయకురాలు పోస్టు ఖాళీగా ఉన్నాయని కమీషన్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారిణి,అలాగే వుమెన్ ఏఎస్ఐ శోభారాణి, వన్ స్టాప్ కేంద్రం సభ్యలు పాల్గొన్నారు.