31.7 C
Hyderabad
April 25, 2024 02: 03 AM
Slider కడప

ఉపాధిహామీ బిల్లులను చెల్లించకపోతే హైకోర్టు ను ఆశ్రయిస్తాం

#batyala

గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేసి ప్రతి ఒక్కరూ నిరుపేదలు, వారు వారి పొట్ట నింపుకోవడానికి ఉపాధి హామీ లో పని చేస్తుంటే,ఆ పని చేసే కూలీల బిల్లులు రెండు నెలలుగా చెల్లించక పోవడం చాలా దారుణం అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు అన్నారు.

MGNREGS బకాయిల పై కడపజిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన “ప్రెస్ మీట్” నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద పని చేసి సుమారు 2 నెలల నుండి బిల్లులు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీల ఆవేదనను దృష్టిలో పెట్టుకోవాలని ఆయన కోరారు.

ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఉపాధిహామీ కూలీల బిల్లులు ఏప్రిల్ నెలలో రెండవవారం,ఇప్పుడు 7 వారాల నుంచి (సుమారు 2 నెలలగా) రావడం లేదని ఇటీవల సిద్ధవటం మండలం మాధవరం-1 పర్యటనలో ఆ పంచాయతీ పరిధిలో పని చేస్తున్న కూలీలు పని ముగంచుకొని వస్తుండగా వారి ఆవేదనను వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.

గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద పనిచేసే కూలీలకు పనిచేసిన తరువాత 7 రోజుల లోపు బిల్లులు చెల్లించాలని…,ఒకవేళ 7 రోజులకు చెల్లించలేని పక్షంలో 15 రోజులలోపైన చెల్లించడానికి ఒక అవకాశం ఉందని అప్పటికి చెల్లించలేని పక్షంలో MGNREGS యాక్ట్ ప్రకారం కూలికి రావలసిన బిల్లుకు 12% వడ్డీ వేసి కూలీలకు బిల్లులు చెల్లించాలని పేర్కొన్నారు.

గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా ఇంకా కూలీలకు 4500 కోట్ల మేర బిల్లులు చెల్లించవలసి ఉందని ఆ కూలీల బిల్లులను చెల్లించకపోవడం వల్ల రాష్ట్రంలో ఎంతో మంది నిరుపేద కుటుంబాలు ఇప్పుడున్న నిత్యావసరాల ధరలను చూసి ఏమీ కొని తినలేక ఒక పూట తిని మిగిలిన రెండు పూటలా పస్తులుంటున్నారని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన రెడ్డి ఇప్పటికైనా ఉపాధి హామీ కూలీలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ జూలై నెల 31వ తేదీ లోపు బిల్లులు చెల్లించాలని బత్యాల గారు రాష్ట్ర ప్రజానీకం, తెలుగుదేశం పార్టీ తరుపున డిమాండ్ చేశారు.

గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద పనిచేసి బిల్లులు అందని విషయంపై జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా ఫోన్ ద్వారా తెలియచేసి కూలీల బిల్లులు వెంటనే వారికి అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతానని బత్యాల తెలిపారు. ఆగస్ట్ 1వ తేదీ లోగా గ్రామీణ ఉపాధిహామీ కూలీల బిల్లులను చెల్లించక పోతే MGNREGS యాక్ట్ ప్రకారం హైకోర్టు లో పిల్ దాఖలు చేసి 0.05 శాతం వడ్డీతో సహా వసూలు చేస్తుమని బత్యాల రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు మహిళ అధ్యక్షురాలు అనసూయ దేవి,పట్టణ అధ్యక్షుడు సంజీవరావు,మాజి కౌనలర్ మనుబోలు వేంకటేశ్వర్లు,అద్దేపల్లి ప్రతాప్ రాజు,బాసినేని వెంకటేశ్వర్లు నాయుడు,అబుబకర్,కొండా శ్రీనివాసులు,కృష్ణమూర్తి నాయుడు,రాంనగర్ నరసింహ,మందా శ్రీను,బాలరాజు,బిసిఆర్ సునీల్,సుదర్శన్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణలో ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ లు

Satyam NEWS

(Natural) An Immediate Cure For High Blood Pressure Homemade Medicine For High Blood Pressure Blood Pressure Drugs Diuretics

Bhavani

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని సత్వరమే పరిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment