38.2 C
Hyderabad
April 25, 2024 11: 38 AM
Slider కరీంనగర్

పెట్టుబడుల్ని ఆకర్షించి యువకులకు ఉపాధి పెంచుతాం

#gangula

రోడ్లు, మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉంటేనే పరిశ్రమలు, ఐటి కంపెనీలు పెట్టుబడులు పెడతాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం ఉదయం హుజూరాబాద్ పట్టణంలోని ప్రజలతో కలిసి బోర్నపల్లి, 14 వ వార్డు, ఇతర ప్రాంతాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పూర్తి నిర్లక్ష్యంతో టౌన్ లోని 350 రోడ్లలో కనీసం మూడు రోడ్లను కూడా సరిగా వేయలేదన్నారు. స్థానికులు ఈటెల చుట్టూ తిరిగి దరఖాస్తులు ఇచ్చినా స్పందించకపోవడం దారుణమన్నారు. కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేటలు డెవలప్ అయినట్టుగా ఇక్కడ డెవలప్ ఎందుకు చేయలేదన్నారు. అక్కడ ఐటీతో పాటు అన్నిరకాల కంపెనీలు వస్తున్నాయని, అదే మాదిరిగా ఇక్కడికి సైతం అభివృద్ధిని తీసుకురావడానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ సిద్దంగా ఉన్నారన్నారు.

ఇప్పటికే 50కోట్లతో రోడ్ల పనులు కొనసాగుతున్నాయని వాటికి అదనంగా కోటీ డెబ్బై లక్షలతో రెండు బ్రిడ్జి పనులు జరుగుతున్నాయన్నారు. ఒకనాడు తెలంగాణ కరెంటు లేక, నీళ్లు లేక, భూముల బీళ్లువారి, కరెంటుకోసం పోలాల్లో పడిగాపులు కాసి, కాలిపోయే మోటార్లతో సబ్ స్టేషన్లవద్ద నిరసన తెలుపుతూ, వలసలతో అరిగోస పడ్డదని, ఆ బాధల్ని రూపుమాపి బంగారు తెలంగాణగా మార్చాలనే సీఎం కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చారన్నారు.

ఉద్యమ నాయకుడి సారథ్యంలో రైతుబందు, రైతుబీమా, ఆసరాఫించన్లు, 24గంటల ఉచిత కరెంటు, కాళేశ్వరంతో పుష్కలంగా నీళ్లు, సమృద్ధిగా పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించిన పార్టీ టీఆర్ఎస్ అని, మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

ఈ  కార్యక్రమంలో మంత్రి గంగుల తో పాటు,14 వ వార్డు టి.ఆర్.ఎస్.పార్టీ ఇంచార్జ్ ఘంట మధుకర్ ,కరీంనగర్ రూరల్ ఫ్యాక్స్ చైర్మన్ ,ఆనంద్ రావు, దొంత రమేష్, కుమార్, కొమురయ్య, రాజు,మరియు గ్రామస్తులు, యువకులు,తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేటీఆర్ చెప్పినా అలకమానవా రామన్నా

Satyam NEWS

శభాష్ ఖాకీ : 24 గంటలలో నిందితుడ్ని పట్టుకున్న పోలీస్…..!

Satyam NEWS

తప్పుడు కేసులతో సతమతమవుతున్న జర్నలిస్టులు

Satyam NEWS

Leave a Comment