పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ భూభాగమేనని ఏదో ఒక రోజు దాన్ని భౌతికంగా కూడా విలీనం చేసుకుంటామని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈ మాజీ అధికారి తొలి సారిగా ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. పాకిస్తాన్ తో చర్చించేందుకు ఉగ్రవాదం సమస్య ఒక్కటే ఉందని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 గురించి ఆ దేశంతో చర్చించేది ఏదీ లేదని జైశంకర్ స్పష్టం చేశారు. భారత్ ఒక్కరు మాత్రమే ప్రత్యేక పొరుగు దేశం ఉంది. ఆ ప్రత్యేక దేశం కూడా ఉగ్రవాదాన్ని వదిలేస్తే సాధారణ పొరుగు దేశం అవుతుందని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితిలోని కొన్ని దేశాలు జమ్మూ కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కదా అన్న ప్రశ్నకు సమాధానంగా ఆర్టికల్ 370ని భారత్ ఎందుకు రద్దు చేసిందో అంతర్జాతీయంగా అందరికి తెలుసునని అన్నారు. ఎవరు ఏమనుకుంటున్నారో అనేదానితో భారత్ కు సంబంధం లేదని, తన అంతర్గత విషయాలను అర్ధం చేసుకుని తదనుగుణంగా వ్యవహరించడం భారత్ కు తెలుసునని అన్నారు.
previous post
next post