31.2 C
Hyderabad
May 29, 2023 22: 06 PM
Slider ఆధ్యాత్మికం

భద్రాద్రి రామయ్య భూములను కాపాడుతాం

#Bhadradri Ramaiah

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో వారికి పండితులు వేదాశీర్వచంనం అందించారు.

పూజారులు, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు రాములవారి క్షేత్రానికి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వేద పండితులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంట ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, తదితరులు ఉన్నారు.

దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ…. పురుషోత్త పట్నంలోని భద్రాచలం సీతారామచంద్ర స్వాముల వారి ఆస్తులు.. మాన్యాలు రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఆన్నారు. ఆక్రమణల నుంచి భుములను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే అక్కడ ఆక్రమ కట్టడాలను కూల్చివేయడం జరిగిందని వెల్లడించారు. మరోవైపు భద్రాద్రి ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.

Related posts

పదిమంది ప్రాణాలు కాపాడినందుకు సీఎంకు రుణపడి ఉంటాం..!

Satyam NEWS

పోలీసు కుటుంబానికి చేయూతను అందించిన సహచర ఉద్యోగులు

Satyam NEWS

2020లో 203 ఉగ్ర‌వాదులు హ‌తం… పాక్ బుద్ధి ఎప్ప‌టికీ మార‌దా?

Sub Editor

Leave a Comment

error: Content is protected !!