27.7 C
Hyderabad
April 25, 2024 10: 36 AM
Slider శ్రీకాకుళం

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందచేస్తాం

#Minister Amarnath

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. ముగ్గురు ఐ ఎ ఎస్, ముగ్గురు ఐ పీ ఎస్ అధికారుల బృందం తో కలిసి రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షతగాత్రులను అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేయమని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రానికి

చెందిన వైద్య బృందాలు ఘటనా స్థలికి మరికాసేపట్లో చేరుకుంటాయి. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసామని డా ఆయన అన్నారు. ఎవరైనా మొబైల్ కు రెస్పాండ్ అవ్వని ప్రయాణికులను గుర్తించే పనిలో ఉన్నామని మంత్రి అమర్నాథ్ చెప్పారు. సహాయక చర్యల కోసం ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా ఇందుకోసం అపాయింట్ చేశారు.

ఖరగ్పూర్ షాలిమార్ ప్రాంతాల నుంచి తెలుగువారు కోరమండల్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్నారు. శ్రీకాకుళం పరిసర జిల్లాలో ఉన్న ఆసుపత్రి సిబ్బందిని వైద్యులను అంబులెన్స్లను ఘటనా స్థలానికి పంపించాలని సీఎం ఆదేశించారు.

క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు ఎంత ఖర్చైనా వెనకాడమని సీఎం చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నుంచి 104, 108 వాహనాలతో తో పాటు డాక్టర్లను కూడా తరలిస్తున్నామని ఆయన అన్నారు.

Related posts

శ్రీ వ‌కుళామాత‌ ఆలయంలో శాస్త్రోక్తంగా క్షీరాధివాసం

Satyam NEWS

ఎదురీతలోనే ఆమె!

Satyam NEWS

తలసరి ఆదాయంలో తెలంగాణ ది బెస్ట్

Satyam NEWS

Leave a Comment