దేశంలో అందరికంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలోనే అంగన్వాడీ టీచర్లకు వేతనాలు ఇస్తున్నామని మిగిలిన సమస్యలు కూడా దశలవారీగా తీరుస్తామని గిరిజన మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ మంత్రి సత్యవతి రాథోడ్ ని నేడు ఆమె నివాసంలో కలిశారు. రాష్ట్రంలో 4000 మంది మినీ అంగన్వాడీలలో టీచర్లు గా పని చేస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిచి ఇప్పటికే రెండుసార్లు వేతనాలు పెంచి మాకెంతో మేలు చేసారని తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు వరలక్ష్మి మంత్రితో తెలిపారు. అంగన్వాడీ లతో సమానంగా మినీ అంగన్వాడీ లు పనిచేస్తున్నాయని, అయితే వీటిలో ఆయాలు లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఉందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మినీ అంగన్వాడీ టీచర్ల సమస్యను త్వరలో పరిష్కరించే ప్రయత్నం చేస్తానని, అప్పటి వరకు అంగన్వాడీ లకు వచ్చే పిల్లలను సొంత బిడ్డల్లాగా చూసుకోవాలని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ మహిళలకు మన రాష్ట్రంలో పథకాలు పెట్టి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.
previous post
next post