31.7 C
Hyderabad
April 18, 2024 23: 13 PM
Slider మహబూబ్ నగర్

కరోనా నివారణకు మాస్కులు ధరించకుంటే చర్యలు

#apoorvaraoIPS

రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య అధికమవుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రజలు  మాస్కులను ధరించాల్సి  ఉంటుందని, కరోనా సెకండ్ వేవ్ క్రమంలో కొన్ని రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయని వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు.

కరోనా వ్యాధిని నియంత్రించడం కేవలం మాస్క్ ద్వారా సాధ్యపడుతుందని తెలిపారు.  ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులను ధరించాల్సి ఉంటుందని, ఎవరైన వ్యక్తులు మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే వారిపై విపత్తు నిర్వహణ చట్టంలోని 51 నుండి 60 సెక్షన్లు, 188 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సదరు వ్యక్తులపై తీసుకునే చర్యల్లో భాగంగా జరిమానాలను విధించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

ఈ నిబంధనలు ఏప్రిల్ 30వ తేది వరకు అమలులో ఉంటాయని, కరోనా వ్యాధి ప్రభావాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు తమవంతు సహకారం అందిచాల్సి వుంటుందని. వనపర్తి జిల్లా పరిధిలో నమోదయ్యే కరోనా కేసులపై దృష్టి సారిస్తూ, పోలీస్ పరంగా అప్రమత్తంగా వ్యవహరించడం జరుగుతోందని, ఇందుకు అనుగుణంగా అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, నిర్వహించవద్దని, ప్రజలు గుంపులగా ఉండరాదని, వివిధ పండుగలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఈ అంక్షలు వర్తిస్తాయని జిల్లా ఎస్పీ  తెలియజేసారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్-19 నిబంధనలను అనుసరించి ప్రజలు మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటిస్తూ, వ్యక్తిగత శుభ్రతను పాటించడం ద్వారా కరోనా వ్యాధి అరికట్టడం సాధ్యపడుతుందని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

మానవత్వమా నీ చిరునామా ఎక్కడ?

Satyam NEWS

లాక్ డౌన్ ను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

Satyam NEWS

శ్రీ పద్మావతి అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు రేపు అంకురార్ప‌ణ‌

Satyam NEWS

Leave a Comment