39.2 C
Hyderabad
March 29, 2024 16: 56 PM
Slider విజయనగరం

మాస్క్ లేకపోతే… వెయ్యి రూపాయలు జరిమానా

#VijayanagaramSP

కరోనా సెకండ్ వేవ్ జడలు విప్పుతోంది. విజయనగరం జిల్లాలో గత మూడు రోజుల నుంచీ… వరుసగా 20 వరకూ నమోదవడంతో జిల్లా యంత్రాంగం అందునా పోలీసు శాఖ అప్రమత్తమైంది.

ఈ మేరకు చట్ట పరంగా ఎస్పీ కరోనా నివారణకు చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయనగరం లో కన్యాకుమారి పరమేశ్వరీ టెంపుల్ వద్ద సాయంత్రం పూట ట్రాఫిక్ ను ఆపి మరీ..మాస్క్ పెట్టుకోకుండా రోడ్ మీద తిరిగితే 500 నుంచే 1000 ళరకు ఫైన్ విధిస్తామని హెచ్చరించారు.

ముందు గా రోడ్లపై మాస్క్ లు లేని వారికి ఎస్పీ స్వయంగా మాస్క్ లు అందజేసారు.అలాగే కోట జంక్షన్ వద్ద ఇద్దరు చిన్నారులు మాస్క్ పెట్టుకుని రోడ్ పైకి రావడాన్ని గమనించిన ఎస్పీ..స్వయంగా కారు..ఆపి ఇద్దరు చిన్నారులను అభినందించి చాక్లెట్లు వారి చేతిలో పెట్టి..మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలని ౠస్పీ అన్నారు.

ఎస్పీ వెంట.. డీఎస్పీ అనిల్ ,సీఐలు మురళీ ,శ్రీనివాసరావు, ఎస్ఐలు దేవీ ,కిరణ్ ,బాలాజీ, సూర్యనారాయణ లు ఇతర సిబ్బంది ఉన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్

Related posts

గణతంత్ర దినోత్సవ వేడుకల పోలీసు కవాతు ప్రాక్టీస్

Satyam NEWS

సీబీఐటిలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం

Satyam NEWS

వరుణ్ తేజ్ వాల్మీకి ఇక గడ్డలకొండ గణేష్

Satyam NEWS

Leave a Comment