27.7 C
Hyderabad
March 29, 2024 01: 43 AM
Slider కడప

నేతన్నల ను ముంచిన వరుస వర్షాలు

#WeaversProblems

నేత నేసే చేనేతన్న మగ్గాలల్లోని గుంతల్లో వర్షపు నీరు వరుసగా మూడుసార్లు చేరడంతో వారు లబోదిబో మంటున్నారు. నేత నేస్తే జీవనం గడవని వారు కన్నీటి పర్వతం ఔతున్నారు…ఇది కడప జిల్లా మాధవరం చేనేతన్న ల వర్షపు నీటి బాధ…గాధ…

కడప జిల్లా సిద్ధవటం మండలం సిద్దవటం మండలంలోని మాధవరం-1 పార్వతీపురం, వెంకటేశ్వరాపురం తదితర గ్రామాలలో ఆదివారం తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా వీధులన్నీ జలమయమయ్యాయి.

దీనితో చేనేత మగ్గాల గుంతల్లోకి నీరువచ్చి చేరడంతో చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. ఈమధ్య కాలంలో ఇలా గుంతల్లోకి నీరు రావడం మూడవసారి అని,గతంలో వచ్చిన నీరు ఇంకి పోక ముందే మళ్ళీ ఇలా నీరు వచ్చి చేరడం వలన తీవ్ర ఇబ్బందులకు గురి కావలసి వస్తుందని,దీని మూలంగా లక్షల్లో నష్టం వాటిళ్ళుతుందని తమగోడు వెళ్ళబోసుకుంటున్నారు.

ప్రభుత్వం వెంటనే ఆదుకుని తగిన నష్టపరిహారం చెల్లించాలని వారు కోరుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో లాక్-డౌన్ వలన పనులు లేక ఇప్పటికే కుదేలైన చేనేత రంగం అకాల వర్షాల కారణంగా పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం వుందని వారు ఆవేదన వ్యక్తంచేశారు.

కరోనా ప్రభావంతో లాక్-డౌన్ తో వ్యాపారాలు లేనందున తయారుచేసిన చీరలకు గిరాకీ లేక కోట్ల రూపాయల సరుకు నిల్వలు ఆగిపోవడంతో ఇంకా చాలా మగ్గాలు పనులకు నోచుకోలేదని, అలాంటిది ఈ అకాల వర్షాలు నేతన్న నెత్తిన గుదిబండలా మారి తీవ్ర నష్టం కలుగచేస్తుందని కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం స్పందించి తగిన సహాయం అందించాలని వారు వేడుకుంటున్నారు.

Related posts

మంత్రి ఈటల కుమార్తె వివాహానికి విచ్చేసిన కేసీఆర్

Satyam NEWS

ఉప్పరపల్లి లో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్!

Bhavani

కాళేశ్వరంతో కళకళలాడుతున్న తెలంగాణ

Bhavani

Leave a Comment