38.2 C
Hyderabad
April 25, 2024 12: 31 PM
Slider మెదక్

కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ఇళ్లు ఉండేవా?

#harishrao

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేడు ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ హైదరాబాద్ లోని గేటెడ్ కమ్యూనిటీ ల లాగా ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ఇండ్లు చూసారా అంటూ ఆయన ప్రజలను ప్రశ్నించారు. అప్పట్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రావాలంటే లంచాలు ఇచ్చేవారు ..ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టం చేసారు. ఖాళీ జాగా వున్నా వారికి కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమంను చేపడాతామని, 5కోట్ల 60 లక్షల వ్యయంతో 88 డబుల్ బెడ్ రూమ్ లను కోహీర్ లో నిర్మించామని తెలిపారు.

150 కోట్ల తో జహీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, మాజీమంత్రి గీతారెడ్డి హయాంలో త్రాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి ఆపరేషన్లలో సంగారెడ్డి జిల్లా టాప్ లో నిలిచిందని, సీఎం కెసిఆర్ ఆధ్వర్యం లో తెలంగాణా లో మంచి వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు.

రేపటి నుండి రైతులకు రైతు బంధు డబ్బులను తమ ఖాతాలో వేసి రైతులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. దేశంలో కాంగ్రెస్ , బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా తెలంగాణ లో ఉన్నట్టు వంటి సంక్షేమ పధకాలు ఎక్కడ లేవని స్పష్టం చేశారు. కోహీర్ లో 50 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి ని నిర్మిస్తున్నాం … దయాలసిస్ సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నాం అని వివరించారు. త్వరలో సంగమేశ్వర ,బస మేశ్వర సాగునీరు ప్రాజెక్ట్ లను ప్రారంభించి గోదావరి జలాలను జహీరాబాద్ కి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ భూముల రేట్లు పెరగడానికి కారణం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అని పేర్కొన్నారు.

Related posts

దేశానికే నూతన దిశ కెసిఆర్ : మంత్రి హరీష్ రావు

Satyam NEWS

ఢిల్లీ ఎయిమ్స్ లో కొత్త ఫంగస్ వ్యాధి.. ఇద్దరి మరణం

Sub Editor

కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ కు అరెస్టు వారంట్ జారీ

Satyam NEWS

Leave a Comment