33.2 C
Hyderabad
April 25, 2024 23: 02 PM
Slider ముఖ్యంశాలు

మాండూస్ తుపాను పై సత్యం న్యూస్.నెట్ తో డీఆర్ఓ ఏమన్నారంటే….

#DRO

ఈ డిశెంబర్ లో చాలా తుపానులు వస్తాయని భారత వాతావరణ శాఖ చెప్పిన దరిమిలా…”మాండూస్” తుపాను రాకనే వచ్చింది. ఈ నెల 8,9 తేదీలలో ఈ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆ “మాండూస్” తుపాను ప్రభావం… దాని పరిస్థితి… తీరం ఎప్పుడు దాటుతుందన్ళ విషయాలను “సత్యం న్యూస్. నెట్’ ప్రతినిధి ఏపీలో ని విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు ను అడిగింది. ఈ “మాండూస్” తుపాను…. ఉత్తర ఏపీ పై తీవ్రంగా ప్రభావం చూపుతోందన్నారు.

అలాగే దాని ప్రభావం తో మచిలీపట్నం, ప్రకాశం ప్రాంతాలపై తీవ్రంగా ఉంటుందన్నారు. ఇక కోస్తా ఆంధ్ర పై “మాండూస్” తుపాను ప్రభావం అంతంత మాత్రమే నని డీఆర్ఓ తెలిపారు. అయినప్పటికీ మాండూస్ తుపాను కారణంగా తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండమని చెప్పామన్నారు.ఈ నెల 10వ తేదీన “మాండూస్’ తుపాను తీరం దాటే అవకాశం ఉందన్నారు. ఆ సమయంలో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తీర ప్రాంతాలైన పూసపాటి రేగ ,కోనాడ ప్రజలను అప్రమత్తం చేసామన్నారు. అలాగే సంబంధిత ఎంఆర్ఓలను అలెర్ట్ గా ఉండమని చెప్పామన్నారు…. జిల్లా రెవెన్యూ శాఖ అధికారి గణపతి రావు.

Related posts

శ్వాసకోశ ఇబ్బందులతో అమిత్ షా ఎయిమ్స్ లో చేరిక

Satyam NEWS

కేబినెట్‌లో చోటు, భారీగా డబ్బు .. బీజేపీపై ఆప్ ఎంపీ గరం

Sub Editor

పారదర్శకతకు పాతర: జీవోలు ఇకపై ఆన్ లైన్ లో ఉండవు

Satyam NEWS

Leave a Comment